సరిహద్దుల్లో డ్రాగన్ భారీ నిర్మాణాలు !
ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ బలగాలను ఉపసంహిరించేస్తామని ఒకవైపు చెబుతున్న డ్రాగన్ దేశం మరోవైపు భారీ నిర్మాణాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా శాటిలైట్ పంపిన ఫొటోలు చూసిన మన సైన్యాధికారులు షాక్ తిన్నారు. వాస్తవాధీన రేఖకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అంటే తన భూభాగంలోనే భారీ భవన నిర్మాణం చేస్తోంది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఈ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికను నిర్మిస్తోంది చైనా ప్రభుత్వం.
హెల్త్ కేర్, బలగాలు విశ్రాంతి తీసుకునేందుకు, ఆయుధాలు పెట్టుకునేందుకు, రాకెట్, ట్యాంకులు, రెజిమెంట్లను ఉంచేందుకు ఈ భవనాన్ని చైనా సైన్యం ఉపయోగించుకుంటుందని మన సైన్యాధికారులు అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తున అదికూడా మంచుకొండల్లో భారీ భవనాలు నిర్మిచటమంటే మామూలు విషయం కాదని సైన్యం అభిప్రాయపడుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్దితుల్లో కూడా చైనా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తున్నదంటే పెద్ద ప్లాన్ తోనే జరుగుతోందని అనుమానిస్తున్నారు.
ఇదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ వైపు వాస్తవాధీన రేఖకు 82 కిలోమీటర్ల దూరంలో కూడా పెద్ద ఎత్తున విశాలమైన రోడ్లు, భారీ భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని మన సైన్యం గుర్తించింది. ఇక్కడ కూడా తన ఆయుధాలను నిల్వ ఉంచుకోవటానికి, మనవైపు రాకెట్లను ప్రయోగించటానికి వీలుగా లాంచింగ్ ప్యాడ్లను కూడా ఏర్పాటు చేసుకుంటోంది. దీనికి అదనంగా ఇటు లడ్డాఖ్ ప్రాంతంలోను ఇటు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా భారీ ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది. అంటే ఏక్షణంలో అయినా వాస్తవాధీన రేఖను దాటేందుకు వీలుగా తన ప్రయత్నాలను డ్రాగన్ చేసుకుంటోందనే విషయం మన సైన్యానికి అర్ధమైపోయింది.
అందుకే ముందు జాగ్రత్తగా మన సైన్యం కూడా సరిహద్దుల్లో మోహరిస్తోంది. యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాచింగ్ ప్యాడ్లు, యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లను ఇఫ్పటికే రెడీగా పెట్టుకుంది. ఎందుకైనా మంచిదని సైన్యాధ్యక్షులు కూడా తరచూ వాస్తవాధీన రేఖ వెంబడే కాపలాగా ఉన్న సైన్యాలతో తరచూ సమావేశాలవుతున్నారు. వాళ్ళల్లో ఉత్సాహం నింపటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా సరిహద్దుల దగ్గరకు వెళ్ళి మరీ వాళ్లతో సమావేశం అయిన విషయం గుర్తుండే ఉంటుంది.