• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ బరితెగించిన చైనా .....

మళ్లీ బరితెగించిన చైనా .. ఉత్తరాఖండ్‌ లో ఆ వంతెన ధ్వంసం !

By - Tupaki Desk
Update: 2021-09-29 08:30 GMT
చైనా .. మాటల్లో చూపించే అభిమానం , చేతల్లో ఉండటం లేదు. సరిహద్దు వద్ద తరచూ వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోమారు తన దుర్భుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు ఎల్‌ ఏ సీ(వాస్తవాధీన రేఖ)ని అతిక్రమించారని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఉత్తరాఖండ్‌ లోని బారాహటి సెక్టార్‌ లోని ఎల్‌ ఏసీ వద్ద ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా గడిపి వెనక్కు వెళ్లారని తెలిపింది. 55 గుర్రాలపై వచ్చిన వీళ్లు అక్కడ ఇండియా ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని, అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని కథనంలో వెల్లడించింది.

టున్‌ జున్‌ లా కనుమ మార్గం గుండా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకొని అక్కడకు ఐటీబీపీ బలగాలు వెంటనే వచ్చాయి. వారు రాకముందే చైనా సైనికులు వెనక్కుపోయారు.  చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు ఇక్కడ పెట్రోలింగ్‌ ఆరంభించాయని సదరు కథనం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు దాదాపు 3 గంటలపాటు ఈ విధ్వంసకాండకు పాల్పడినట్లు ఈ పత్రిక తెలిపింది. బారాహోటిలోని వంతెనను చైనా సైనికులు ధ్వంసం చేస్తున్నారని స్థానికులు భారతీయ భద్రతా దళాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. వెంటనే భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు ఈ ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిపింది.  హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో టిబెట్ సరిహద్దు 545 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ సెక్టర్‌లో ఉంది. దీనిలో దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై  భారత్-చైనా మధ్య వివాదం ఉంది. ఈ భూభాగం ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాఖండ్‌ లోని చమోలీ జిల్లాలో బారాహోటి ఉంది. ఇది చైనా సరిహద్దుల్లో ఉంది. నందా దేవి నేషనల్ పార్క్‌ కు ఉత్తర దిశలో ఉంది. 2017 జూలైలో చైనా సైనికులు రెండుసార్లు ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డారు. అప్పట్లో డోక్లాం వద్ద చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.
Tags:    
  • Himachal Pradesh 
  • Peoples Liberation Army 
  • Chinese Army 
  • Uttarakhand 
  • Uttarakhand bridge 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS