వుహాన్ ల్యాబ్ శాత్రవేత్తలకి నోబెల్ ఇవ్వాలి : చైనా !

Update: 2021-06-23 03:49 GMT
కరోనా మహమ్మారి .. ఈ ప్రాణాలు తీసే వైరస్ ఎవరు ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా కూడా జగమెరిగిన సత్యం ఏమిటంటే కరోనా వైరస్ అనేది చైనా లో వుహాన్ లోని ల్యాబ్ లో నుండి బయటకి వచ్చింది. అలాగే మొదటగా ఈ వైరస్ భారిన పడింది కూడా చైనానే. ఆ తర్వాత అక్కడి నుండి ఒక్కొక్క దేశం విస్తరిస్తూ , మొత్తం ప్రపంచానికి పాకింది. ప్రతి దేశం కూడా కరోనా దెబ్బకి వణికిపోయింది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటికి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. కరోనా మహమ్మారిని అరికట్టడానికి మందు కనిపెట్టారులే అనుకున్న సమయంలోనే రోజుకో కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా చైనా  వుహాన్ ల్యాబ్ శాత్రవేత్తలకి నోబెల్ ఇవ్వాలట. పాపం ప్రపంచ జనాభాను తగ్గించినందుకు , మహమ్మారి కారణంగా సెలవులు ఎక్కువగా ఇప్పించినందుకు ఖచ్చితంగా వుహాన్ ల్యాబ్ కి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే. ఈ వింత వాదనను చైనా విదేశాంగ అధికారి ప్రతినిధి రూఫ్ లీజియాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా కొత్త వైరస్ ను కనిపెట్టి మనుషుల మీద చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఖచ్చితంగా వారికి నోబెల్ ఇచ్చి తీరాల్సిందే అని కొందరు సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. కరోనా జన్యు క్రమాన్ని చైనా శాస్త్రవేత్తలు మొదటగా గుర్తించారు. ఆ మాత్రానికే కరోనా వైరస్ కు మూలం వుహానే అనడం సరికాదని , చైనా శాస్త్రవేత్తలే వైరస్ను తయారు చేశారనడంలో అర్థం లేదని లిజియాన్ అన్నారు. అలాగే , వుహాన్ శాస్త్రవేత్తల బృందం కరోనాపై చేస్తున్న పరిశోధనలకు వైద్యం రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని లిజాయాన్ తెలిపారు. ఓవైపు కరోనా వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందా అనే విషయంపై  అమెరికా దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు చైనా మాత్రం ఆ ల్యాబ్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సరికొత్త వాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం. కరోనా వైరస్ మహమ్మారి  చేసిన పరిశోధనలకు గానూ వుహాన్ ల్యాబ్ను చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అవార్డుకు నామినేట్ చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్ప్ తాజాగా వెల్లడించింది. ఏదేమైనా .. కరోనా మహమ్మారి ను చైనాలోని  వుహాన్ ల్యాబ్  లోనే పుట్టించారని  అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తో సహా పలు దేశాల అధినేతలు , పలువురు నిపుణులు కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది. కానీ, ఇప్పటికి కూడా చాలామంది చైనా లోని వుహాన్ ల్యాబ్ లో కరోనా పుట్టింది అని చాలామంది విశ్వసిస్తున్నారు.
Tags:    

Similar News