తెలుగోళ్లకు చుక్కలు చూపించిన ఎయిర్ కోస్టా

Update: 2015-11-28 04:51 GMT
విమానంలో ప్రయాణం చేయాలంటే ఏమేం చేయాలో బారెడు లిస్ట్ ఉండే బాధ్యతల గురించి విమానయాన సంస్థలు చెప్పేస్తుంటాయి. మరి.. తామెంత బాధ్యతగా వ్యవహరిస్తామన్న విషయంపై మాత్రం పెదవి విప్పరు. తాజాగా బాధ్యరాహిత్యంగా వ్యవహరించిన ఎయిర్ కోస్టా ఎయిర్ లైన్స్ ఫుణ్యమా అని వందకు పైగా తెలుగోళ్లకు చుక్కలు కనిపించిన పరిస్థితి. శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన ఎయిర్ కోస్టా విమానాన్ని.. కారణం అంటూ ఏమీ చెప్పకుండానే క్యాన్సిల్ చేసేశారు.

దీంతో.. ప్రయాణం కోసం ప్లాన్ చేసుకున్న వందకు పైగా ప్రయాణికులు చిక్కుల్లో చిక్కుకుపోయారు. ఏ కారణంతో ఎయిర్ కోస్టా విమానాన్ని రద్దు చేసిన విషయాన్ని విమానయాన సంస్థ వివరణ ఇవ్వటం లేదు. దీంతో.. అగ్రహం చెందిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థ నిర్లక్ష్యంపై నిప్పులు కక్కుతున్నారు. అయినా.. ఇదేమైనా సిటీ బస్సా.. ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్లుగా నడపటానికి. విమాన ప్రయాణానికి సంబందించి ఎంతమంది ఎన్నెన్ని ప్లాన్లు ఉంటాయి? ఎన్ని వ్యక్తిగత పనులకు నష్టం వాటిల్లుతుంది? బాధ్యతగా వ్యవహరించని విమానయాన సంస్థలు చేసే ఇలాంటి పనులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News