కలకలం: హైదరాబాద్ లో పేలిన బాంబ్
హైదరాబాద్ బాంబు పేలుడు కలకలం రేపింది. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాంనగర్ లో ఈ బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. వైట్ హౌస్ హోటల్ సమీపంలో చెత్తా డబ్బాలో పేలుడు సంభవించడంతో నాగయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నాగయ్యను ఆస్పత్రికి తరలించారు. నాగయ్య కుప్పలో చెత్త ఏరుతుండగా పేలుడు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా చెత్తకుప్పలో ఉన్న పెయింట్ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బాంబు పేలుడు కలకలం చోటుచేసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లో్మణ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.