• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమిత్ షా తో కరచాలనం...?

అమిత్ షా తో కరచాలనం...?

By - Tupaki Desk
Update: 2022-05-11 14:30 GMT
ఆయన దేశానికి హోం మంత్రి.  ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన హోదాలో ఉన్నారు. ఇక బీజేపీకి కూడా సర్వం సహా ఆయనే. మోడీ ఆయన వేరు కానే కాదు. అలాంటి అమిత్ షా తో కరచాలనం చేయాలని తెలుగుదేశానికి చాలా కాలంగా ఉంది. ఆ మధ్యన అంటే గత ఏడాది పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చంద్రబాబు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఆ తరువాత ఢిల్లీ కూడా వెళ్ళి ప్రధానిని, హోం మంత్రిని కలవాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇక అమిత్ షా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు కూడా చంద్రబాబు చెప్పారు. అయినా సరే బీజేపీ మనసేమిటో, మాటేమిటో కూడా టీడీపీ నేతలకు తెలియడంలేదు.

ఇపుడు మరోసారి అమిత్ షాకు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఏపీలో రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారు అని బాబు అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఆయన ప్రస్థావించినట్లుగా చెబుతున్నారు. నారాయణను అరెస్ట్ చేయడాన్ని అక్రమమని పేర్కొన్న చంద్రబాబు అమిత్ షా కి దీని మీద గట్టిగానే ఫిర్యాదు చేశారు.

మరి ఈ లేఖ మీద అమిత్ షా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ఆయన దేశానికి హోం మంత్రి అయినా ఏపీ వ్యవహారాల మీద ఎంత మేరకు జోక్యం చేసుకుంటారు అన్నది కూడా చూడాలి. ఏపీలో వైసీపీ సర్కార్ ఉంది. అది కేంద్రంలోని బీజేపీతో సన్నిహితంగానే ఉంటోంది. పైగా ముందు  ముందు రాజకీయ అవసరాలు ఉన్నాయి.

మరి ఈ సమయంలో టీడీపీ ఫిర్యాదు మేరకు అమిత్ షా రియాక్ట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి. సాధారణంగా ఢీ అంటే ఢీ కొట్టే రాష్ట్రాలలో రాజకీయం ఎపుడూ వేడిగానే ఉంటుంది. దానికి కచ్చితమైన ఉదాహరణ పశ్చిమ బెంగాల్. అక్కడ బీజేపీ విపక్షంలో ఉంటూ ఎన్ని రకాలుగా మమతా బెనర్జీ సర్కార్ చేతిలో ఇబ్బందులు పడుతోందో అందరికీ తెలుసు.

మరి తన సొంత పార్టీ ఇబ్బందులలో ఉన్నా అమిత్ షా ఎంతవరకూ జోక్యం చేసుకోవాలో అంతవరకే అన్నట్లుగా ఉంటున్నారు. అలాంటిది ఏపీలో జోక్యం చేసుకోగలరా. ఈ సంగతులు ఏవీ టీడీపీ అధినాయకత్వానికి తెలియవు అని అనుకోరు. అయితే ఇక్కడే ఉంది రాజకీయం. అమిత్ షా తన లేఖ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నదే చంద్రబాబుకు కావాలి.

ఆయన సానుకూలంగా రియాక్ట్ అయితే మాత్రం రేపటి రోజున బీజేపీతో చెలిమి చేసేందుకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలా కాకుండా పట్టించుకోకపోతే మాత్రం మళ్లీ మళ్లీ ప్రయత్నాలు ఇలా చేస్తూనే ఉండాలి. ఏది ఏమైనా అమిత్ షా కోర్టులోకి బంతి ఒకటి వేసి టీడీపీ రిజల్ట్ కోసం చూస్తోంది అంటున్నారు. మరి షా ఏం చేస్తారు. వెయిట్ అండ్ సీ.
Tags:    
  • Nara Chandrababu Naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS