ఏపీలో స్మార్ట్ డెస్కులు

Update: 2015-11-26 10:53 GMT
నవ్యాంధ్రలో స్మార్టు వార్డు - స్మార్డు విలేజ్ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి మండల - జిల్లా స్థాయిలో స్మార్టు డెస్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. స్మార్టు విలేజ్ ను అభివృద్ధి చేసేందుకు, జిల్లా స్థాయిలో కమిటీ నిర్ణయాలను సకాలంలో అమలు చేసేందుకు జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో ఓ డెస్కును ఏర్పాటు చేస్తారు. దీనికి డిప్యూటీ సీఈవో స్మార్టు విలేజ్ కార్యదర్శిగా ఉంటారు. ప్రభుత్వ ప్రైవేటు రంగం నుంచి ఆర్థిక నిపుణుడు, ఒక ఐటీ నిపునుడు కూడా కమిటీలో ఉంటారు.

మండల స్థాయిలో ఎంపీడీవో స్మార్టు డెస్కు కార్యదర్శిగా ఉంటాడు. స్మార్టు విలేజీల్లో చేసే పనులను వెబ్ సైట్ లో ఉంచుతారు. వీటిని ప్రభుత్వ బడ్జెట్ - పార్టనర్ – ప్రభుత్వ బడ్జెట్ - పార్టనర్ నిర్వహించే బడ్జెట్లుగా విభజిస్తారు. జియో ట్యాగింగ్ ద్వారా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్విటర్ - ఫేస్ బుక్ - లింక్ డ్ ఇన్ తదితర మాధ్యమాల ద్వారా ఇది నిరంతరం సేవలు అందిస్తుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డుకు లింకు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ సీఎం ఆధ్వర్యంలో మూడు నెలలకోసారి మంత్రులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమవుతారు. తద్వారా 2018 నాటికి స్మార్టు విలేజీల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.
Tags:    

Similar News