‘ఆనం’ కోసం బాబు ఆగం.. వైసీపీలోకే మొగ్గు
నెల్లూరు రాజకీయాల్లో దశాబ్ధాలుగా వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. కాంగ్రెస్ ఏపీని విభజించడంతో వీరు చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ మధ్యే టీడీపీలో చేరారు. కానీ చంద్రబాబు శీతకన్ను వేయడం.. వీరిని పట్టించుకోకపోవడంతో లోలోపల రగిలిపోయారు. బాబుపై అసహనాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఆ తర్వాత పార్టీ మారేందుకు నిర్ణయించారు. ఇంతలోనే ఆనం వివేకానందరెడ్డి మరణించడంతో పార్టీ మారడాన్ని వాయిదా వేశారు.
ఇటీవల మహానాడులో చంద్రబాబుపై ఆనం రాంనారాయణ రెడ్డి ఫైర్ అవ్వడం చూశాక ఆయన వైసీపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత ఆనం తనకు దగ్గరైన కార్యకర్తలు నాయకులతో సమావేశమై వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు.
ఆనం లాంటి బలమైన నేతలు పార్టీ మారితే నష్టపోతామని ఆలస్యంగా తెలుసుకున్న టీడీపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - నారాయణలు ఆనంను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు సైతం ఫోన్ చేసి వైసీపీలో చేరవద్దని సూచించారు. దీంతో ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆలోచించాలని ఆనం వాయిదా వేస్తూ వస్తున్నారు.
తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆనం ‘పార్టీ మారడానికి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నామని’ స్పష్టం చేశారు. ‘పార్టీ మారతానని ఇప్పుడే చెప్పలేదు కదా ’ అంటూ ట్విస్ట్ కూడా ఇచ్చారు. అయితే ఆనం వివేకానంద రెడ్డి తనయులు మాత్రం టీడీపీలోనే కొనసాగుదామంటూ రాంనారాయణ రెడ్డిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. దీని వెనుక చంద్రబాబు లాబీయింగ్ ఉందని సమాచారం. అందుకే ఆనం నిర్ణయాన్ని వాయిదా వేశారు. ‘కుటుంబమంతా ఒక్క చోట కూర్చొని.. నిర్ణయం తీసుకుంటాం.. ఈ విషయంలో ఇంకో మాటకు తావులేదు’ అంటూ తాజాగా స్పష్టం చేశారు.
అయితే అందరూ ఎంత ఒత్తిడి తెస్తున్నా ఆనం వైసీపీలో చేరాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం..