ప్రశ్న అడిగితే సిగ్గులేదనటమేంటి..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త బ్యాలెన్స్ ఎక్కువే. మిగిలిన వారి మీద నోరు పారేసుకున్నా.. మీడియా మీదా.. మీడియా ప్రతినిధుల మీదా ఆయన పెద్దగా అరవరు. కానీ.. ఆ మధ్య కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుల మీదా ప్రత్యేకంగా విరుచుకుపడే వారు. దీనికి రాజకీయ కారణాలుగా సర్ది చెప్పుకునే వారు.
తాజాగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. చాలా తీవ్రస్వరంతో ఒక మీడియా ప్రతినిధి మీద చిరాకు పడిపోవటం.. బాబు నోటి నుంచి ఎప్పుడూ రాని విధంగా సిగ్గులేదా? అంటూ కెమేరాల సాక్షిగా తిట్టేయటం కాస్తంత విశేషమే. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి రేవంత్‌రెడ్డి వీడియో.. చంద్రబాబు ఆడియో (?) టేపులు విడుదలై.. పార్టీ అధినేత మొదలు నేతల వరకూ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఒత్తిడి పుణ్యమో.. మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయటం.. వారు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానలు చెప్పలేకపోవటం.. ప్రతి ప్రశ్నకు లాజిక్ తీయటంతో దానికి సమాధానం చెప్పలేక చిరాకు పడిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోయిన ఆయన.. అందులోని తెలంగాణ అధికారపక్షంపై ఎదురుదాడి చేయటానికి ఎంత ప్రయత్నించినా పరిస్థితులు సహకరించకపోవటంతో ఆయన అసహనం చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే.. ''ఆడియో ఫ్యాబికేటెడ్ అంటున్నారు.. అలాంటప్పుడు ట్యాపింగ్ సాధ్యం కాదు కదా?'' అని ప్రశ్నించిన విలేకరిపై బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల గురించి.. అవినీతి గురించి మాట్లాడతావా? సిగ్గులేదా అంటూ చిరాకు పడిపోయారు. మొత్తంగా చూస్తుంటే చంద్రబాబు కాస్త బ్యాలెన్స్ తప్పుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బుల్లెట్లు దూసుకుపోవాలే కానీ.. ఇలా తడబడిపోవటం ఏమిటి బాబు..?