ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను హైజాక్ చేసిన సీబీఎన్!
కనీసం ఏపీ కాంగ్రెస్ లీడర్లు అయినా.. చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ..ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలు మాత్రం బాబును అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. తన అవసరానికి ఎవరిని అయినా కీర్తించే చంద్రబాబు నాయుడు అవసరం తీరాకా అదే వ్యక్తులను ఎంత కించపరచడానికి అయినా వెనుకాడడు అని చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకూ మోడీని ప్రశంసించిన తీరు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిడుతున్న తీరును గమనిస్తే చాలు.. ఆయన తత్వం ఏమిటో అర్థం చేసుకోవడానికి. అయితే ఇంత చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు చంద్రబాబు ముందుకు వెళ్లాడు. అక్కడ తను మునగడంతో పాటు కాంగ్రెస్ ను కూడా ముంచాడు చంద్రబాబు. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి అడ్డం తిరిగాడు. ఏపీలో పొత్తు కావాలని అన్నా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చాడు చంద్రబాబు నాయుడు. అక్కడ అయినా బాబు తీరు గురించి అర్థం చేసుకోవాల్సింది. అయినా అర్థం కాలేదు కాంగ్రెస్ నేతలకు.
ఒకవైపు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్నట్టుగానే కలరింగ్ ఇస్తున్నాడు. వరసగా వెళ్లి రాహుల్ ను కలుస్తున్నాడు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొద్దో గొప్పో నేతలను కూడా బాబు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. తన అవసరం కోసం వారిని తన పార్టీలోకి చేర్చుకొంటూ ఉన్నాడు. ఇదీ చంద్రబాబు నాయుడి తీరు.
ఇక ఢిల్లీలో కాంగ్రెస్ తో స్నేహాన్ని అయితే నటిస్తున్నాడు కానీ.. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో అలా సాన్నిహిత్యంగా కొనసాగుతాడు అనేది సందేహమే. రేపు బీజేపీ వాళ్లు మినిమం మెజారిటీని రీచ్ అయ్యి.. చంద్రబాబు వద్ద కొద్దో గొప్పో సీట్లు ఉంటే.. వాళ్లు రమ్మంటే బాబు పరిగెత్తుతాడు కూడా. అయితే వచ్చే ఎన్నికల్లో బాబు బోల్తా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబును గుడ్డిగా నమ్ముతోంది. బాబు సొంతంగా సీట్లు సంపాదించుకునేంత సీన్ లేదని తెలిసినా బాబు ఆడమన్నట్టుగా కాంగ్రెస్ ఆడుతోంది. మొత్తానికి కాంగ్రెస్ హై కమాండ్ నేతలను బాబు బాగానే హైజాక్ చేసినట్టుగా ఉన్నాడు.