కీల‌క‌మా.. క‌రివేపాకా? బాబు ఫ్యూచ‌ర్ పై ఈ రోజే క్లారిటీ!

Update: 2019-05-19 05:25 GMT
ఉత్కంట వీడ‌నుంది. సుదీర్ఘంగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేందుకు వీలుగా ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల కానున్నాయి. తుది ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యం ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌లకు కాస్తంత క్లారిటీ రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో జాతీయ స్థాయి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కాస్తంత మార్పు చోటు చేసుకోవ‌టం ప‌క్కా అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అన్నింటికి మించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భ‌విత‌వ్యం ఏమిట‌న్న దానిపైనా ఈ రోజు సాయంత్రానికి స్ప‌స్ట‌త వ‌చ్చే వీలుంద‌ని చెప్పాలి. ఏపీలో ఆయ‌నకు గెలుపు అవ‌కాశాలు లేవ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా వెలువ‌డే ఎగ్జిట్ పోల్స్ దానిపై ఒక క్లారిటీ ఇచ్చే వీలుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఏపీలో అధికారంతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో ఎన్డీయేత‌ర కూట‌మికి ఆయ‌న కీల‌కంగా మార‌దామ‌ని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా భిన్న ధ్రువాలుగా ఉండే ప‌లువురు నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  అయితే.. ఈ ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రావాలంటే ఈ రోజు వెలువ‌డే ఎగ్జిట్ ఫ‌లితాలు కూడా అంతో ఇంతో ప్ర‌భావం చూపిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బాబు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఏపీలో తాను గెలిచి.. బీజేపీకి 200 సీట్ల‌కు ప‌రిమిత‌మైన‌ట్లుగా లెక్క‌లు వ‌స్తే.. బాబు కీల‌క‌నేత‌గా ఆవిర్భ‌వించ‌ట‌మే కాదు.. బిజీబిజీ కావ‌టం ఖాయం.

కాంగ్రెస్ కు కానీ 150 కంటే ఎక్కువ సీట్లు వ‌చ్చే వీలుంటే.. ప్ర‌భుత్వ ఏర్పాటులో బాబు కీల‌కం అవుతారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ కు 100.. అంత‌కంటే త‌క్కువ సీట్లకు మాత్రం ప‌రిమిత‌మైతే మాత్రం బాబు డిమాండ్ భారీగా ఉంటుంది. ఈ అంచ‌నాల‌కు భిన్నంగా ఏపీలో ఓట‌మితో పాటు.. బీజేపీ 250-300 సీట్ల మార్క్ కు చేరుకుంటే మాత్రం బాబు అవ‌స‌రం ఎవ‌రికి ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయన తిరిగిన దానికి అర్థ‌మేమీ ఉండ‌క‌పోగా.. కొత్త త‌ల‌నొప్పులు ఖాయ‌మ‌ని చెప్పాలి. ఇలాంటి లెక్కల నేప‌థ్యంలో బాబు కీల‌కం అవుతారా?  కూర‌లో క‌రివేపాకు అవుతారా? అన్న దానిపై ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News