• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దిల్లీ బలపరీక్షలో...

దిల్లీ బలపరీక్షలో చంద్రబాబు విఫలమైనట్లేనా?

By - Tupaki Desk
Update: 2018-04-04 15:30 GMT
నిత్యం సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు రేటింగులు ఇచ్చే చంద్రబాబు తన సొంత బలాన్నీ పరీక్షించుకునే ప్రయత్నంలోనే దిల్లీ వచ్చారన్న విమర్శ ఒకటుంది. అంతేకాదు.. ఆ సెల్ఫ్ టెస్టులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారట. ఆ సంగతి అర్థం కావడంతోనే టీడీపీ నేతలు ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు టాక్. టీడీపీ నేత సీఎం రమేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పైకి చెప్పకపోయినా చంద్రబాబు తన బలాన్ని పరీక్షించుకునేందుకు దిల్లీ వచ్చారన్న ప్రచారం ఒకటుంది. ఒకప్పుడు థర్డ్ ప్రంట్లలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు నిజానికి ఇప్పుడు దేశంలోని ఇతర పార్టీల నుంచి పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. తాజాగా ఆయన దిల్లీలో భేటీ అయిన నేతలు, వారు స్పందించిన తీరుతో ఎవరూ ఆయన్ను సీరియస్ గా తీసుకోలేదన్న సంగతీ అర్థమవుతోంది.
    
ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం రమేశ్ వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి. టీడీపీకి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కన్నా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రమేష్ అన్నారు. సో.. మిగతా పార్టీల నుంచి ఆశించిన రెస్సాన్సు రాకపోవడంతో విషయం బోధపడి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. మోదీని ఎదుర్కోగలరని కానీ.. లేదంటే ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించగల దక్షత - క్లీన్ ఇమేజి - రాజకీయ విశ్వాసం ఏవీ చంద్రబాబుకు ఇప్పుడు లేవన్న భావన ఇతర పార్టీల్లో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా చంద్రబాబు వచ్చినా రాజకీయాల్లో ఏమాత్రం చలనం రాకపోవడంతో బాబు ఈ బలపరీక్షలో ఓటమి చెందారని గుసగుసలాడుకుంటున్నారట.
    
రెండు రోజుల దిల్లీ పర్యటనలో అంచనాలు విఫలం కావడంతో చంద్రబాబుకు ఇప్పుడు మరింత టెన్షన్ పట్టుకుందని.. పలు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం పొలిటికల్ సీన్ మార్చేసినట్లే ఏపీపైనా ఫోకస్ చేసి తానే టార్గెట్‌ గా రాజకీయాలు చేసే డేంజర్ ఉందని టెన్షన్ పడుతున్నారట. అయితే.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు కాబట్టి చివరి ప్రయత్నంగా సుదీర్ఘ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి బీజేపీ మోసాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.  అసలే జనసేన - బీజేపీ అంతా తనను వదిలేసిన ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలా అని చింతిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు దిల్లీలో ఎదురైన అనుభవాలు మరింత దిగులులోకి నెట్టేశాయట.
Tags:    
  • Chandrababu naidu 
  • Third Front 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS