క్రష్ణా జిల్లా వాళ్లకి కొవ్వు!
రాయలసీయ వాసులు తిండికి లేక సతమతమవుతూంటే క్రష్ణా జిల్లా వారు మాత్రం కొవ్వుతో కొట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీమ జిల్లాల వారికి పౌష్టికాహార లోపం... క్రష్ణా జిల్లా వారికి మాత్రం అధిక బరువు... కొవ్వు ఎక్కువ అని ఆయన అన్నారు. అంతే కాదు.... రాష్ట్రం కోసం తాను 24 గంటలూ కష్టపడుతూంటే మీరు మాత్రం చీకు చింతా లేకుండా ఉన్నారంటూ అసహసం వ్యక్తం చేశారు. క్రష్ణా జిల్లా విసన్నపేటలో జరిగిన గ్రామ దర్శిని కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు ఇది. దీనిపై అక్కడి వారే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం అవుతోంది. మీ సమస్యలుంటే నాకు ఫిర్యాదు చేయండని తాను ఫోన్ ద్వారా కోరినా కేవలం 30 శాతం మంది మాత్రమే స్పందిస్తున్నారని, ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉన్నాయి. అయినా మీరెవరూ స్పందిచరని, ఇలా అయితే సాంకేతికతను ఎలా ఉపయోగించుకుని ఎదుగుతామని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలకు క్రష్ణా జిల్లాకు చెందిన వారు కలత చెందుతున్నారు. తాము అన్ని విధాల ముఖ్యమంత్రికి - ప్రభుత్వానికి సహకరిస్తూంటే... ఆయన ఇలా స్పందించడం ఏమిటంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఒకటి రెండు జిల్లా పర్యటనలో ఇలాగే స్పందించారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి స్ధాయిలో ఇలా మాట్లాడడం ఆయనకు తగదని వారంటున్నారు. తమకు కొవ్వు ఎక్కువైతే చంద్రబాబు నాయుడు ఏమైనా మమ్మల్ని పోషిస్తున్నారా అని వారు మండిపడుతున్నారు. సెల్ ఫోన్లు ఉన్నంత మాత్రాన వాటిని వినియోగించడం రావాలని, తమకు వచ్చే ఫోన్లకు సమాధానాలు చెప్పడం... తాము ఎవరికైనా ఫోన్లు చేయడం వరూ తప్ప మిగిలిన అంశాలు తమకు తెలియవని వారంటున్నారు. సెల్ పోన్లు వాడడం రాకపోతే వారు నాగరీకులు కాదా... అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి క్రష్ణా జిల్లాలో నాలుక జారిన ముఖ్యమంత్రి తర్వాత ఇంకెలా మాట్లాడతారోనని తెలుగుదేశం నాయకులు భయపడుతున్నారు.