గోరంట్లను వదలని చంద్రబాబు.. కథేంటి?

Update: 2021-08-29 07:34 GMT
చంద్రబాబును కాదంటున్నా.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నా.. అసమ్మతి రాజేస్తున్నా కూడా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ప్రేమ మాత్రం తగ్గడం లేదట చంద్రబాబుకు.. ఎన్టీఆర్ హయాం నుంచి తమతో కలిసి పనిచేసిన గోరంట్ల ఎంత వ్యతిరేకించినా ఆయనపై కోపం రావడం లేదు చంద్రబాబుకు.. తాజాగా గోరంట్ల అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియగానే చంద్రబాబు తెగ బాధపడిపోయాడట.. సమాజానికి, పార్టీకి అమూల్యమైన సేవలందించే గోరంట్ల త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

రాజమండ్రి టీడీపీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ విషయం పార్టీ వర్గాల ద్వారా చంద్రబాబుకు తెలియడంతో తల్లడిల్లిపోయారు. వెంటనే గోరంట్లకు చంద్రబాబు ఫోన్ చేసి ఆరోగ్యాన్ని వాకబు చేశారు.  అనారోగ్యానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా అయ్యారని అడిగి తెలుసుకున్నారట.. ఈసందర్భంగా త్వరగా కోలుకునేందుకు రెస్ట్ తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.  వెంటనే కోలుకొని మీరు రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చంద్రబాబు కోరినట్టు తెలిసింది.
Read more!

ఇటీవలే చంద్రబాబు, లోకేష్ ల తీరుపై గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ తీరు మారాలని పలు సూచనలు సహాలు ఇచ్చారు. పార్టీ సమస్యల గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు, లోకేష్ లకు పలుమార్లు ఫోన్ చేసినా వారు రిసీవ్ చేసుకోకపోవడంతో మనస్థాపానికి గురైన గోరంట్ల బుచ్చయ్య విమర్శలు గుప్పించారు. గౌరవం లేని చోట ఆత్మాభిమానం చంపుకొని ఉండాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 ఈ క్రమంలోనే ఆయన వైసీపీ లో లేదా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈక్రమంలోనే చంద్రబాబు ఫోన్ చేయడంతో ఇదంతా టీకప్పులో తుఫానులా చెరిగిపోతుందా? అన్న అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News