చిరంజీవికి భ‌య‌ప‌డ‌లేదు. కానీ జ‌గ‌న్ కు భ‌య‌ప‌డ్డారుగా!

Update: 2018-07-08 16:05 GMT
తెలుగుదేశం నేత‌ల‌కు లోలోప‌ల భ‌యం పెరిగే కొద్దీ... ఇత‌ర పార్టీల‌పై దాడి పెరుగుతోంది. అంతేకాదు... పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ పెంచుకోవ‌డానికి త‌ర‌చుగా గొప్ప‌ల‌కు పోతూ త‌మ భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసుకుంటున్నారు. జ‌గ‌న్‌ కు వ‌స్తున్న స్పంద‌నతోనే వారిలో క‌ల‌వ‌రం పెరుగుతుండ‌గా... పాత మిత్రుడు పవ‌న్ విమ‌ర్శ‌లు ఊపిరాడ‌నివ్వ‌కుండా చేస్తున్నాయి. తాజాగా తిరుమ‌ల‌లో మాట్లాడిన చిన‌రాజ‌ప్ప మాట‌లు వింటే వారిలో ఎంత భ‌యం ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

గ‌తంలో చిరంజీవికే మేము భ‌య‌ప‌డలేదు, ఇక ప‌వ‌న్ కు భ‌య‌ప‌డ‌తామా అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. చిరంజీవికి భ‌య‌ప‌డ్డారో లేదో తెలియ‌దు గాని వైఎస్ జ‌గ‌న్‌ కు మాత్రం భ‌య‌ప‌డ్డారు. ఇది స్వ‌యంగా తెలుగుదేశం మాజీ మిత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. సాధార‌ణంగా ఇత‌ర పార్టీ అగ్ర‌నేత‌కు క్రెడిట్ వ‌చ్చే మాటను మ‌రో పార్టీ అధినేత మాట్లాడ‌రు. కానీ ప‌వ‌న్ ఆ మాట అన్నారంటే క‌చ్చితంగా అది నిజ‌మే అయ్యుండాలి. తెలుగుదేశం పార్టీ అంత భారీ అనుభ‌వాన్ని వెన‌కేసుకుని మొన్న పెట్టిన ఒక యువ‌కుడి పార్టీకి భ‌య‌ప‌డుతోంది అంటే జ‌నంలో జ‌గ‌న్‌ కు ఆద‌ర‌ణ ఏ స్థాయిలో ఉందో చంద్ర‌బాబుకు అంత‌ర్గ‌త స‌ర్వేల్లో అర్థ‌మ‌వ‌డ‌మే కార‌ణం కావ‌చ్చు.

ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల జ‌పం - ప్ర‌త్యేక హోదా జ‌పం చేస్తోందంటే... అది క‌చ్చితంగా జ‌గ‌న్ క్రెడిట్టే. ఒక‌టే మాట‌, ఒక‌టే బాట‌గా సాగుతున్న జ‌గ‌న్ బాట‌లోకి ముఖ్య‌మంత్రి న‌డ‌వ‌డం మొద‌లుపెట్టారు. దీనికి వారి హామీల చిట్టాయే కార‌ణం. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని 2014లో జ‌గ‌న్ క్రేజును త‌ట్టుకోవ‌డానికి ఇష్టారీతిన హామీలు ఇచ్చేశారు. ఇపుడు వాట‌న్నిటినీ అమ‌లు చేయలేక చేతులు ఎత్తేశారు. ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమ‌లు చేయ‌లేదు. దీంతో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త గూడు క‌ట్టుకోంది. 40 ఏళ్లు రాజకీయ అనుభ‌వం ఉన్న వ్య‌క్తి, 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా అనుభ‌వం ఉన్న వ్య‌క్తిపై ప్ర‌జ‌ల్లో కోపం ఉందంటే... ఎన్ని అబ‌ద్ధాలు చేసి ఉంటే జ‌నానికి అంత‌ కోపం వ‌స్తుందో ఒక‌సారి టీడీపీ నేత‌లు ఆలోచించుకోవాలి.
Tags:    

Similar News