ఒకే తాటి మీద‌కు ఇద్ద‌రు చంద్రుళ్లు..జ‌గ‌న్‌..ఎలా సాధ్య‌మైంది?

Update: 2019-07-26 07:10 GMT
దేశంలో అత్యంత శ‌క్తివంతులు మోడీషాలన్న‌ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి సందేహాల్లేవు. ఒక‌వేళ అలాంటి సందేహాలు ఉంటే.. తాజా ఎపిసోడ్ తో అలాంటి అపోహ‌ల‌న్నీ తొలిగిపోయే ప‌రిస్థితి. వారి వ్యూహాలను చూస్తూ విస్మ‌యంతో ఉండిపోవాల్సిందే. ఉత్త‌ర‌ ద‌క్షిణ ధ్రువాల్ని క‌ల‌ప‌టం అసాధ్యం. కానీ.. సాధ్య‌మేన‌ని త‌మ తీరుతో చేసి చూపించారు మోడీషాలు.

కేసీఆర్.. చంద్ర‌బాబు.. జ‌గ‌న్ లు ఒకే తాటి మీద‌కు వ‌చ్చే కాంబినేష‌న్ ను ఊహించ‌గ‌ల‌మా?  అస‌లు సాధ్య‌మా?  అంటే నో చెప్పేస్తారు. కానీ.. అలాంటిది కూడా త‌మ‌కు సాధ్య‌మేన‌ని తాజాగా పాస్ చేసిన బిల్లు తో స్ప‌ష్టం చేశారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని స‌వ‌రిస్తూ బిల్లును ప్ర‌వేశ పెట్ట‌టం.. తాజాగా రాజ్య‌స‌భ‌లో ఆమోదించుకోవ‌టం కోసం అరుదైన ఫీట్ ను చేశారు మోడీషాలు.

లోక్ స‌భ‌లో అవ‌స‌రానికి మించిన స‌భ్యుల బ‌లం ఉన్న‌ప్ప‌టికి.. రాజ్య‌స‌భ‌లో మాత్రం అలాంటి ప‌రిస్థితి ఇంకా రాలేదు. దీంతో.. లోక్ స‌భ‌లో పాస్ అయిన బిల్లును.. రాజ్య‌స‌భ‌లో పాస్ చేసుకోవ‌టం మోడీషాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ టాస్క్ ను పూర్తి చేసేందుకు ఎవ‌రూ ఊహించ‌ని కాంబినేష‌న్ ను ప్లాన్ చేశారు.

ఇందుకోసం మిత్రుల‌నే కాదు.. ప్ర‌త్య‌ర్థుల్ని.. ఇటీవ‌ల కాలంలో చావుదెబ్బ తీసిన పార్టీల‌ను సైతం త‌మ‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకునే టాలెంట్ ను చూపించ‌టం ద్వారా.. తమ ప్ర‌యోజ‌నాల్ని పూర్తి చేసుకునేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు రెఢీ అన్న విష‌యాన్ని తాజాగా ఎపిసోడ్ లో నిరూపించార‌ని చెప్పాలి.

త‌మ‌కు అవ‌స‌ర‌మైన రాజ్య‌స‌భ స‌భ్యుల కోసం టీఆర్ ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల‌తో పాటు.. ఇటీవ‌లే విలీనం చేసుకున్న టీడీపీ ఎంపీలతో పాటు మిగిలిన ఇద్దరు  టీడీపీ ఎంపీల చేత కూడా త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయించుకోవ‌టంలో మోడీషాలు స‌క్సెస్ అయ్యారు. ఇలా.. ఎవ‌రూ ఊహించ‌లేని కాంబినేష‌న్ ను ఆవిష్క‌రించిన క్రెడిట్ మాత్రం వారిద్ద‌రికే చెల్లుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News