చంద్రబాబు నాయుడు పగలంతా ఇక మకాం అక్కడే!

Update: 2019-06-29 04:08 GMT
ఒకవైపు 'ప్రజావేదిక'ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, దాన్ని నేలమట్టం చేసింది. తను ప్రజలను కలవడానికి ప్రజావేదిక కావాలని చంద్రబాబు నాయుడు ఓడిపోగానే కోరిన సంగతి తెలిసిందే. దాన్ని కేటాయించడం మాట అటుంచి.. దాన్ని కూల గొట్టింది జగన్ ప్రభుత్వం. ఆ అక్రమ కట్టడం పై తెలుగుదేశం పార్టీ గగ్గోలు కొనసాగుతూ ఉంది.

ఇక చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అది కూడా అక్రమ కట్టడం అని ఇప్పటికే తేల్చారు. నోటీసులు వెళ్లాయి.  వారం రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఇక చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక అద్దె ఇంటిని చూసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.ఆ సంగతలా ఉంటే..చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకలాపాలకు, నేతలు, కార్యకర్తలతో సమావేశాలకు వేదికను అయితే ఏర్పాటు చేసుకన్నారట. గుంటూరు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఇక నుంచి నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారని సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

ప్రతి రోజూ  పగలంతా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉంటారని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఏపీలో టీడీపీకి ప్రధాన కార్యాలయం నిర్మితం అవుతూ ఉంది. అది పూర్తయ్యే వరకూ  చంద్రబాబు నాయుడు గుంటూరు ఆఫీసులో అందుబాటులో ఉంటారని టీడీపీ పేర్కొంది.

    

Tags:    

Similar News