సహజీవనం, పెళ్లికి ముందు గర్భం... 500 + 3,000 ఫైన్!
అయితే... ఇలాంటి వాటికి జరిమానాలు విధిస్తూ.. ఫైన్ల బోర్డు ఒకటి తెరపైకి తెచ్చింది ఓ గ్రామం. దీనిపై విమరలు వెళ్లువెత్తాయి. ఈ కథాకమీషు ఏమిటో ఇప్పుడు చూద్దామ్...!;
ఇటీవల కాలంలో సహజీవనం అనేది చాలా కామన్ అయిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో టైర్ 1 నగరాలే కాదు.. టైర్ 2, టైర్ 3 పట్టణాలకూ ఈ వ్యవహారం పాకిందని అంటున్నారు! కొన్ని ప్రాంతాల్లో విలేజ్ లలోనూ మొదలైపోయిందని చెబుతున్నారు. అయితే... ఇలాంటి వాటికి జరిమానాలు విధిస్తూ.. ఫైన్ల బోర్డు ఒకటి తెరపైకి తెచ్చింది ఓ గ్రామం. దీనిపై విమరలు వెళ్లువెత్తాయి. ఈ కథాకమీషు ఏమిటో ఇప్పుడు చూద్దామ్...!
అవును... మహిళలు, యువతులు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని.. కీప్యాడ్ ఫోన్లు మాత్రమే వాడాలని.. పైగా వాటికి పక్కింటికి వెళ్లినప్పుడు, బయట కార్యక్రమాలకు వెళ్లినప్పుడు తీసుకెళ్లకూడదని ఇటీవల రాజస్థాన్ లోని ఓ గ్రామంలో పెద్దలు తీర్మానించిన సంగతి తెలిసిందే. చదువుకునే అమ్మాయిలు ఒక వేళ స్మార్ట్ ఫోన్ వాడాల్సి వస్తే.. అది ఇంటి వరకే పరిమితం కావాలని రూల్స్ పాస్ చేసింది. ఈ సమయంలో.. సహజీవనం, వివాహానికి ముందు గర్భవతి అవ్వడం వంటి విషయాలపై ఓ గ్రామం జరిమానాల బోర్డులు పెట్టింది.
వివరాళ్లోకి వెళ్తే... నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ లోని ఓ గ్రామంలో... "గ్రామ నియమాలు: అందరూ సమానం" అనే నోటీసు బోర్డు వెలిసింది. దీంతో.. ఈ బోర్డును ఫోటోలు తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ నోటీస్ బోర్డులో.. సహజీవనం, అవివాహిత గర్భధారణ, గ్రామం వెలుపల వ్యక్తిని వివాహం చేసుకోవడం మొదలైన అంశాలకు ఫైన్లు కనిపిస్తున్నాయి.
ఆ బోర్డు ప్రకారం... ప్రావిన్స్ వెలుపల వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు ($210) జరిమానా విధించబడుతుంది. ఇదే సమయంలో.. పెళ్లి కాకుండా గర్భవతి అయితే 3,000 యువాన్లు ($420).. కలిసి జీవించే అవివాహిత జంటలు ఏడాదికి 500 ($70) చెల్లించాలి. ఇదే సమయంలో.. పెళ్లి అయిన తర్వాత 10 నెలల లోపు బిడ్డ జన్మిస్తే 3,000 యువాన్లు.. జంట తగాదాలకు గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తే 500 యువాన్ల జరిమానా విధించబడుతుంది.
ఈ జరిమానాల పట్టిక అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే! ఇంకా చాలానే ఉంది! ఇందులో భాగంగా... ఇతర గ్రామాల్లో మద్యం సేవిస్తూ ఇబ్బంది కలిగించే లేదా రౌడీ ప్రవర్తనను ప్రదర్శించే వ్యక్తులకు 3,000 నుంచి 5,000 యువాన్లు ($700) వరకూ జరిమానా విధించబడుతుంది. ఇదే క్రమంలో.. గ్రామంలో పుకార్లు వ్యాప్తి చేయడం లేదా నిరాధారమైన వాదనలు చేసిన వారికి 500 - 1,000 యువాన్ల వరకూ జరిమానా విధించబడుతుంది.
దీంతో.. ఈ రూల్స్ బోర్డుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా... "ఆ గ్రామ పెద్దలు డబ్బు పిచ్చి వాళ్లై ఉండాలి" అని ఒకరంటే.. "మనం 1925లో ఉన్నామా లేక 2025లో ఉన్నామా?" అని మరొకరు స్పందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ బోర్డులను తొలగించారు. ఇది చాలా అసాధారణం అంటూ ప్రభుత్వం అంగీకరించింది.