గ్రామ వార్డు సచివాలయాలపైన సీరియస్ డెసిషన్

ఏపీలో సచివాలయ సిబ్బంది పని గంటలు ఏమిటి వారు ఎపుడు వస్తున్నారు ఎపుడు వెళ్తున్నారు అన్న సంగతి మీద చర్చ అయితే సాగుతోంది.;

Update: 2025-12-28 03:30 GMT

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న లక్షా పాతిక వేల మంది సిబ్బందికి ఒక విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సకాలంలో రావడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక వచ్చిన వారు కూడా ఎపుడు వెళ్తారో తెలియడం లేదు తాము సచివాలయాలకు వెళ్తే సిబ్బంది కనిపించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయని అంటున్నారు దాంతో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గానే వ్యవహరించనుంది అని అంటున్నారు.

పనితీరు మీదనే :

ఏపీలో సచివాలయ సిబ్బంది పని గంటలు ఏమిటి వారు ఎపుడు వస్తున్నారు ఎపుడు వెళ్తున్నారు అన్న సంగతి మీద చర్చ అయితే సాగుతోంది. ఇదే విషయం మీద ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ గానే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం చేపట్టాల్సిన చర్చలు తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళిక మీద కూడా చర్చిస్తోంది.

యాప్ ద్వారానే :

ఇక మీదట పకడ్బందీగా సచివాలయ ఉద్యోగుల పనివేళలను ప్రభుత్వం మానిటరింగ్ చేయనుంది అని అంటున్నారు. సిబ్బంది అంతా ప్రతీ రోజూ తప్పనిసరిగా సచివాలాయానికి హాజరు కావాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు ఒకవేళ సిబ్బంది ఏ పని మీద ఔయినా ఎక్కడికి అయినా వెళ్ళినా పై అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలా బయట ఉంటే కనుక అక్కడ నంచే తమ హాజరు ని నమోదు చేయాలి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ ని రూపొందిస్తున్నారు. ఆ యాప్ ద్వారా సచివాలయ ఉద్యోగుల మొత్తం మూవ్మెంట్స్ అన్నీ నమోదు చేస్తారు అని అంటున్నారు.

సూపర్ వైజ్ చేయాల్సిందే :

వార్డు గ్రామ సచివాలయాలలో సరైన పర్యవేక్షణ అయితే సిబ్బంది మీద లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాలలో పంచాయతీ అధికారులు, మునిసిపాలిటీలలో కమిషనర్లు, కార్పోరేషన్లలో జోనల్ కమిషనర్లు పరిధిలో సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే డైరెక్ట్ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే సిబ్బందిలో కొంత మంది దీనిని అలుసుగా తీసుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి దాంతో ప్రజలు వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వెళ్ళినపుడు అందుబాటులో ఉండడంలేదని అంటున్నారు.

ఇక మీదట అలా కాకుండా సచివాయాల సిబ్బంది పనితీరుని పర్యవేక్షించేందుకు వివిధ స్థాయిలలో అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. వీరు చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తారు అని అంటున్నారు అదే విధంగా ఇప్పటిదాకా కొంత మంది సిబ్బందికి ఇతర శాఖలలో ఖాళీలు ఉంటే అక్కడ పనిచేయడానికి డెప్యుటేషన్ మీద పంపించారు. ఇపుడు ఆ డెప్యూటేషన్ ని కూడా రద్దు చేశారు. దాంతో సిబ్బంది అంతా సచివాలయాలలో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి సచివాలయాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News