అప్పటి నుంచేనట....కొడాలి రీ ఎంట్రీ పాలిటిక్స్ !

ఇదిలా ఉంటే తాను తొందరలోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని ఈ మధ్యనే నాని సందేశం ఇచ్చారు.;

Update: 2025-12-28 02:30 GMT

వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2019 నుంచి 2022 దాకా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక శాఖలను చూసిన కొడాలి నాని 2024 లో తొలిసారి ఓటమిని చూశారు. దాంతో దాదాపుగా రెండేళ్ళ పాటు గ్యాప్ తీసుకున్నారు. అయితే ఆయనకు ఈ మధ్యలో హార్ట్ ఆపరేషన్ జరగడం వైద్యులు ఆయనను రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇక ఓటమి తరువాత గుడివాడను వదిలేసి కొడాలి నాని పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని ప్రధాన అనుచరులను టార్గెట్ చేసింది. చాలా మంది పైన కేసులు పడ్డాయి. ఇక క్యాడర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని వారికి కనీసంగా కూడా టచ్ లోకి రాకపోవడంతో గుడివాడలో నాని కంచుకోటకు కొంత మేర బీటలు వారాయని ప్రచారం సాగింది.

దూకుడు చేసిన టీడీపీ :

ఇక ఇదే తగిన సమయం అని టీడీపీ కూడా గుడివాడలో రాజకీయంగా దూకుడు చేసింది. ఎన్నారై అయిన వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తన మార్క్ ని చూపిస్తూ గుడివాడలో టీడీపీకి రెండు దశాబ్దాల తరువాత దక్కిన భారీ సక్సెస్ ని కంటిన్యూ చేసే పనిలో పడ్డారు. ఇక వైసీపీ వైపు నుంచి సౌండ్ అంతగా లేకపోవడం కూడా టీడీపీ వార్ వన్ సైడ్ పాలిటిక్స్ కి ఎంతో కలిసి వచ్చిందని అంటున్నారు ఈ నేపథ్యంలో గుడివాడకు నాని తిరిగి వస్తారా రాజకీయంగా కొనసాగుతారా అన్న చర్చ కూడా సాగింది. వైసీపీ అధినాయకత్వం అయితే నాని ప్లేస్ లో కొత్తవారిని దింపి అయినా పార్టీని అక్కడ కాపాడుకోవాలని ఆలోచనలు చేసింది అని కూడా ప్రచారం సాగింది.

వస్తున్నా అంటూ :

ఇదిలా ఉంటే తాను తొందరలోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని ఈ మధ్యనే నాని సందేశం ఇచ్చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు హెల్త్ బాగా లేకపోవడం వల్లనే కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిదని చెప్పారు. ఇక తాను తగ్గేది లేదని ఎక్కడ ఆపానో అక్కడ నుంచే మొదలుపెడతాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు జగన్ ని సీఎం చేసేంతవరకు తన రాజకీయ జోరు ఆగదని కూడా స్పష్టం చేశారు. మరి కొడాలి నాని ఎపుడు రాజకీయంగా దూకుడు చేస్తారు, మరెప్పుడు గుడివాడలో అడుగు పెడతారు అన్న చర్చ కూడా సాగుతోంది.

సంక్రాంతి తోనే :

అయితే గుడివాడలో సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున ఏళ్ల తరబడి నిర్వహించిన ఘనత నానికి ఉంది మంత్రిగా ఉంటూ కూడా ఆయన ఎడ్ల పందేలు వంటివి నిర్వహించి జగన్ ని సీఎం గా ఉండగా ఆహ్వానిస్తూ వచ్చారు. అయితే 2025 లో మాత్రం ఆయన గుడివాడకు రాలేదు, మరి 2026 సంక్రాంతి పండుగ ముందుంది, కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. దాంతో నాని ఈసారి సంక్రాంతి సంబరాలకు సొంతూరు గుడివాడకు వెళ్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అలా ఆయన అతి పెద్ద పండుగ తెలుగువారికి అయిన సంక్రాంతి నుంచే సెంటిమెంట్ గా భావించి తన మలి విడత రాజకీయానికి శ్రీకారం చుడతారా అన్నదే ఇపుడు అంతటా ఆలోచిస్తున్నారు. మరి గుడివాడకు నాని సంక్రాంతికి వస్తున్నారా లేదా అన్న దానిని బట్టి ఆయన ఫ్యూచర్ రాజకీయం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News