40 రోజులుగా నాన్ స్టాప్ వర్షాలు.. ఆ సంపన్న దేశం ఉక్కిరిబిక్కిరి

సరైన వర్షం ఒక్కరోజు కురిసినా.. ప్రజాజీవితానికి ఎంత ఇబ్బంది అన్నది తెలిసిందే. కొన్నిసార్లు మూడు నాలుగురోజులు వరుసగా వర్షాలు పడే పరిస్థితో అనూహ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయి.;

Update: 2026-02-11 07:30 GMT

సరైన వర్షం ఒక్కరోజు కురిసినా.. ప్రజాజీవితానికి ఎంత ఇబ్బంది అన్నది తెలిసిందే. కొన్నిసార్లు మూడు నాలుగురోజులు వరుసగా వర్షాలు పడే పరిస్థితో అనూహ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటిది ఏకంగా 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో యూకే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఏడాది మొదటి రోజు (2026, జనవరి 1) నుంచి ఇప్పటివరకు ఆ దేశాన్ని వర్షం వెంటాడుతూనే ఉంది. ఒక్కరోజు కూడా వర్షం పడని రోజు లేదంటుననారు. ముఖ్యంగా యూకేలోని దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

యూకే మొత్తంలో 26 వాతావరణ కేంద్రాల్లో నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం ముగిసే సమయానికి యూకేలో సరాసరి వర్షపాతం 37 శాతం కురవగా.. ఇంగ్లాండ్ లో అది కాస్తా 59శాతంగా నమోదైంది. ఇక.. దక్షిణ ఇంగ్లాండ్ లో అయితే 72 శాతానికి చేరటం ఒక ఎత్తు అయితే.. అబెర్డీన్ లో అయితే ఏకంగా ఫిబ్రవరి సగటు 180 శాతం దాటేసింది. దీంతో యూకే వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పాడు వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అంటూ తిట్టుకునే పరిస్థితి.

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ వారంలో వాతావరణ పరిస్థితులు మారే వీలుందని అంచనా వేసతున్నారు. అదే సమయంలో మరో ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 15-24 మధ్యలో అట్లాంటిక్ నుంచి వచ్చే బలమైన గాలులు యూకేలో ప్రవేశించొచ్చని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలు అందుతున్నాయి. అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే వరద ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది టెన్షన్ గా ఉందని చెబుతున్నారు

Tags:    

Similar News