మహిళా ఓట్లను టార్గెట్ చేస్తున్న చంద్రబాబు
రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ. అందుకనే రాబోయే ఎన్నికల్లో మహిళ ఓట్లన్నింటినీ తెలుగుదేశంపార్టీకి మళ్ళించేందుకు చంద్రబాబునాయుడు వ్యూహాన్ని సిద్ధం చేసినట్లున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 1వ తేదీనుండి మహిళా ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
గ్రామాలు, పట్టణాల్లో మహిళలతో సదస్సులు నిర్వహించాలని పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయమైంది. ఈ ఆత్మగౌరవ సమావేశాలు ఎన్నిరోజులు, ఎన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలన్న విషయం డిసైడ్ అయినట్లు లేదు.
ప్రజాస్వామ్య సౌదమైన అసెంబ్లీని కౌరవసభగా మార్చి మహిళల ఆత్మగౌరవంపై ఏ విధంగా దాడి చేశారో వివరించేందుకే మహిళా ఆత్మగౌరవ సభలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఏ రూపంలో సదస్సులు నిర్వహిస్తున్నా అది వైసీపీకి వ్యతిరేకంగానే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇంతకీ హఠాత్తుగా మహిళా ఆత్మగౌరవ సభలను ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే తన భార్య భువనేశ్వరి గురించి సభలో చాలా నీచంగా మాట్లాడారని చంద్రబాబు ఆరోపించటమే కాకుండా మీడియా సమావేశంలో భోరున ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందే.
నిజానికి పాలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయం కూడా వ్యూహాత్మకమే అని అర్ధమవుతోంది. సమావేశానికి ముందుగానే భువనేశ్వరితో ఒక బహిరంగ లేఖను రాయించారు. తనకు చాలా అన్యాయం జరిగినట్లు భువనేశ్వరితో చెప్పించారు.
ముందు లేఖ రాయించటం తర్వాత పాలిట్ బ్యూరో సమావేశంలో మహిళ ఆత్మగౌరవ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేయటమంటే వ్యూహాత్మకమే అర్ధమైపోతోంది. అందుకనే మూడు రోజులు వరసగా తన భార్యను అవమానించారని కడప, చిత్తూరు జిల్లా పర్యటనల్లో ఊదరగొట్టారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి భర్తీ చేసిన పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేస్తోంది. పంచాయితిల్లో సర్పంచుల పదవుల నుండి చట్టసభలైన అసెంబ్లీ, పార్లమెంటు వరకు మహిళలకు మంచి ప్రాధాన్యతే ఇస్తోంది.
తాజాగా భర్తీచేసిన శాసనమండలి డిప్యుటీ ఛైర్మన్ పదవిలో కూడా ముస్లిం మహిళ జకియా ఖానూమ్ ను జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ పదవులను వదిలిపెడితే కార్పొరేషన్ల భర్తీలో కూడా మహిళలకే ప్రాధాన్యతిచ్చారు.
ఈ రకంగా చూసుకుంటే మహిళల్లో మెజారిటి ఓట్లు వైసీపీకే పడుతున్నది. ఈ మధ్యనే ముగిసిన స్ధానిక సంస్దల ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లలో మెజారిటి వైసీపీకే పడినట్లు తేలింది. కాబట్టి ఇపుడు చంద్రబాబు మహిళల ఓట్లను వైసీపీకి దూరం చేయాలని ప్లాన్ చేశారు.
ఇందులో భాగమే తన భార్యను అవమానించారని ఏడ్వటం, నాలుగు రోజుల తర్వాత భువనేశ్వరితో లేఖ రాయించటం, తాజాగా మహిళల ఆత్మగౌరవ సభలని చెప్పటం. మహిళల ఓట్లకోసం చంద్రబాబు బాగానే ప్లాన్ చేస్తున్నారు కానీ సక్సెస్ అవుతారా ? అన్నదే పాయింట్.