టీడీపీ సామాన్య కార్యకర్త కోరిక తీర్చిన చంద్రబాబు .. ఆ కోరిక ఏంటంటే ?
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం లో ఎప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందుంటారు. కరోనా తర్వాత అయన జూమ్ ద్వారా ప్రతి రోజు పార్టీ నేతలతో , కార్యకర్తలతో మాట్లాడుతూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఓ అభిమాని కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. టీడీపీ సామాన్య కార్యకర్త కోరిక తీర్చారు. కొత్త జంటకు పెళ్లిరోజు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ ఆనందంతో ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ దళిత నేత అశోకన్ కుమారుడు ఆల్బర్ట్ టీడీపీ అంటే అభిమానం. వారి కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. ఆల్బర్ట్ తన వివాహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరుపుకోవాలని అనుకున్నాడు. దీనితో వెంటనే ఆల్బర్ట్ తన కోరికను నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ కు చెప్పారు.
వెంటనే ఈ విషయాన్ని పార్టీ నేతలు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. భాను విజ్ఞప్తి మేరకు వివాహ కార్యక్రమంలో చంద్రబాబు జూమ్ వీడియో కాల్ ద్వారా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశీర్వాదం అందుకున్న దంపతులకు, ఆ కుటుంబం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.