బాబుకు కుప్పం గుర్తుకొచ్చింది.. రివ్యూలో కీలక వ్యాఖ్యలు
తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గం అప్పుడప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వస్తుంటుంది. నిత్యం.. పార్టీకి సంబంధించిన రివ్యూతో పాటు.. ఏదోలా మీడియా లో కనిపించనిదే నిద్ర పట్టని బాబు.. ఏదో ఒక వ్యాఖ్య చేయటం తెలిసిందే. గతానికి భిన్నంగా కుప్పంలో ఇబ్బందికర వాతావరణం నెలకొన్న వేళ.. ఆయన చేపట్టిన పార్టీ రివ్యూ ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలో మూడు వేల ఇళ్ల నిర్మాణ పనుల్ని నిలిపివేశారన్నారు.
అవే కాక.. ప్రాజెక్టు పనులు.. చెక్ డ్యామ్ ల నిర్మాణాల్ని నిలిపివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని తరిమేశారన్న ఆయన.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్పడుతున్న దైర్జన్యాల్ని బాబు ఖండించారు. టీడీపీ జెండాలు పీకేసి.. విగ్రహాలు ధ్వంసం చేసినా ప్రజల గుండెల్లో పార్టీని తొలగించ లేదన్నారు.
జగన్ పార్టీ నేతల బెదిరింపుల్ని పట్టించుకో వద్దన్న బాబు.. తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు పార్టీలో లేరన్నారు. పార్టీకి ప్రజల్లో బలం ఉందని నేతలకు గుర్తు చేసిన ఆయన.. తాము అధికారం లోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు జరిగిన దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. అయినా.. బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు.. రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేయటం కష్టమే. కాదనం. కానీ.. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పనులన్ని ఎందుకు పూర్తి చేయించుకో లేకపోయారు?తాను కాస్త ఖాళీగా ఉంటే చాలు.. తన నియోజకవర్గ నేతలతో మాట్లాడే బాబు.. పార్టీ క్యాడర్ కు అవసరమైన ‘భరోసా’ ఇవ్వటం లేదన్న మాట వినిపిస్తోంది.