కరోనా వ్యాధిగ్రస్థులు బ్రతికే ఛాన్స్ లేదా.. ఉంటే ఎంత ఛాన్స్ ?

Update: 2020-03-03 22:30 GMT
కరోనా వైరస్ ..ప్రస్తుతం చైనాతో పాటుగా ప్రపంచంలోని పలు దేశాలని పట్టిపీడిస్తున్న ప్రాణాంతకరమైన వైరస్. ఈ వైరస్ భారిన పడి ఇప్పటికే 3,125 మంది చనిపోయారు. సుమారుగా 90 వేల మంది ఈ వైరస్ భారిన పడి , ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే , ఈ వైరస్ భారిన పడివారు ప్రతి వెయ్యి కరోనావైరస్ కేసుల్లో ఐదు నుంచి 40 కేసుల్లో రోగి మరణించే ఆస్కారం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.  
అంటే..ప్రతి వెయ్యి మందిలో తొమ్మిది మంది  బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది.  ఈ మరణాల రేటు బాధితుల వయసు, లింగం, ఆరోగ్య స్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కరోనా వల్ల వృద్ధులు, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. నడివయసువారి కన్నా వయసు బాగా పైబడినవారిలో మరణాల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి భారీ అధ్యయనంలో వెల్లడైంది. 30 ఏళ్లలోపువారిలో మరణాల రేటు అత్యంత తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండెజబ్బులు, లేదా శ్వాసకోశ వ్యాధులున్న బాధితుల్లో మరణాల రేటు ఐదింతలు ఎక్కువగా ఉంది. మొత్తంగా మహిళలతో పోలిస్తే మగవారిలో మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉంది.
Read more!

ఏయే ప్రాంతంలో ఏయే వర్గాలకు ఎంత ముప్పుందనేదానిపై పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
చైనాలో 80 ఏళ్ల బాధితులకు ఒక రకమైన ముప్పుంటే, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో అదే వయసున్న బాధితులకు వేర్వేరు రకాల ముప్పులు ఉండొచ్చు. వ్యాధి నుంచి కోలుకోవడం, కోలుకోలేకపోవడం బాధితులకు అందే చికిత్సపైనా ఆధారపడి ఉంటుంది. వైరస్ వ్యాప్తి తీవ్రత, వనరుల లభ్యతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే , ఈ వైరస్ కారణం మరణించే వారి మరణాల రేటుని లెక్కకట్టడం కూడా అసాధ్యం. ఎందుకు అంటే పరిశోధకులు చాలా అంశాలని లెక్కలోకి తీసుకోని ఈ మరణాలరేటుని లెక్కకడతారు. కానీ , ఒక్కో దేశంలో ఈ వైరస్ ప్రభావం ఒక్కోలా ఉండచ్చు. వైరస్ అందరిపైనా ఒకే విధంగా ప్రభావం చూపడం లేదు కాబట్టి నిర్దిష్టమైన మరణాలరేటుని చెప్పడం కష్టం. అయితే చైనాలోని హుబే రాష్ట్రం డేటాను మాత్రమే చూస్తే మరణాలు రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. చైనాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హుబేలో మరణాల రేటు బాగా ఎక్కువగా ఉంది. హుబే రాజధాని వుహాన్‌లోనే వైరస్ తొలుత బయటపడింది.
Tags:    

Similar News