ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం

Update: 2020-09-20 09:10 GMT
అసలు కరోనా వైరస్ ప్రబలి.. అన్ని మూతపడి కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇలాంటి టైంలో కేంద్రంలోని ప్రభుత్వం ఉపాధికి బాటలు చూపాలి.కానీ ఉన్న ఉద్యోగులను కూడా తీసివేయించేలా వ్యవహరించడంపై నిరుద్యోగులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు తమ సంస్థలో ఎవరినైనా తీసేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.

గతంలో 100మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ఈ వెసులుబాటు ఉండేది. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లుపై ట్రేడ్ యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

కంపెనీలకు మేలు చేసేలా కేంద్రం చట్టం ఉందని.. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్లకే దోచిపెడుతోందని.. నిరుద్యోగులు, ఉద్యోగుల బాధలు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఈ బిల్లుతో వచ్చింది..
Tags:    

Similar News