కాంగ్రెస్ 60, బీఆర్‌ఎస్ 12, బీజేపీ 0.. ప్రస్తుతానికి మున్సిపల్ ఫలితాలివీ..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుతోంది.;

Update: 2026-02-13 12:16 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా ఇప్పటికే సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2,582 వార్డుల్లో జరిగిన ఈ పోరులో మెజారిటీ వార్డులు కాంగ్రెస్ ఖాతాలోకే చేరాయి.

మున్సిపాలిటీల వారీగా తాజా పరిస్థితి చూస్తే.. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 116 మున్సిపాలిటీల్లో

కాంగ్రెస్ 60

బీఆర్‌ఎస్ 12

భాజపా 0

ఇతరులు 1

హంగ్ 34

ఫలితం రావాల్సినవి 9 ఉన్నాయి.

కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర

కేవలం మున్సిపాలిటీలకే పరిమితం కాకుండా కీలకమైన మూడు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

- మంచిర్యాల కార్పొరేషన్

మొత్తం 60 వార్డులకు గానూ కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించింది.

కాంగ్రెస్: 41 వార్డులు

బీఆర్‌ఎస్: 8 వార్డులు

భాజపా: 4 వార్డులు

ఇతరులు: 2 వార్డులు

- రామగుండం కార్పొరేషన్

పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది.

కాంగ్రెస్: 36 వార్డులు

బీఆర్‌ఎస్: 13 వార్డులు

భాజపా: 1 వార్డు

ఇతరులు: 4 వార్డులు

- నల్గొండ కార్పొరేషన్

నల్గొండలో మొత్తం 48 వార్డులు ఉండగా, కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది.

కాంగ్రెస్: 26 వార్డులు

బీఆర్‌ఎస్: 8 వార్డులు

భాజపా: 4 వార్డులు

ఇతరులు: 7 వార్డులు

కరీంనగర్ కార్పొరేషన్ ( 66 డివిజన్లు)

బీజేపీ 34

కాంగ్రెస్ 14,

బీఆర్‌ఎస్ 6

ఇప్పటికీ 34 మున్సిపాలిటీల్లో 'హంగ్' ఏర్పడటంతో, అక్కడ స్వతంత్ర అభ్యర్థులు, ఇతరుల మద్దతు కీలకం కానుంది. మరో 9 మున్సిపాలిటీల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సాధించిన ఈ విజయం, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలాన్ని మరోసారి నిరూపించింది. బీఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ జోరు ముందు తలవంచక తప్పలేదు.

Tags:    

Similar News