బీఎన్ఎస్ విజయం వెనక యువ నాయకురాలు
ఆమె ఎవరో కాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన ఖలీదా జియా మనవరాలు. అదే విధంగా బీఎన్ఎస్ అధినేత కాబోయే ప్రధాని అయిన తారిక్ రెహ్మాన్ కుమార్తె.;
బంగ్లాదేశ్ ఇపుడు అంతర్జాతీయంగా గట్టిగా వినిపిస్తున్న పేరు. బంగ్లాదేశ్ లో గత రెండేళ్ళుగా శాంతి భద్రతలు పెద్దగా లేవు, నిత్యం అల్లర్లు, ఘర్షణ వాతావరణంతో దేశం ఎపుడు అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తూనే ఉంది. ప్రత్యేకించి హిందువుల మీద దాడులు హత్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమొత్తంగా తీర్మానించుకుని మరీ 299 స్థానాలకు గానూ 212 స్థానాలను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి కట్టబెట్టారు. దాంతో బీఎన్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో ఇంతటి అద్భుతమైన విజయం బీఎన్ఎస్ ని దక్కడం వెనక ఒక యువ నాయకురాలి ప్రభావం అత్యధికంగా ఉందని అంటున్నారు.
మామ్మకు తగిన మనవరాలు :
ఆమె ఎవరో కాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన ఖలీదా జియా మనవరాలు. అదే విధంగా బీఎన్ఎస్ అధినేత కాబోయే ప్రధాని అయిన తారిక్ రెహ్మాన్ కుమార్తె. ఇరవై ఎనిమిదేళ్ళ ఈ యువ నాయకురాలి పేరు జైమా జర్నాజ్. ఆమె తారిఖ్ రెహ్మాన్ దంపతులకు ఏకైక కుమార్తె. లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా అందుకున్న జైమా జర్నాజ్ తండ్రితో పాటు బంగ్లాదేశ్ కి ఈ మధ్యనే వచ్చారు. 2009లో బీఎన్ఎస్ ఓటమి తరువాత లండన్ లోనే ఖలీదా జియా కుటుంబం అంతా ఉంటూ వచ్చింది. ఇక షేక్ హసీనా ప్రభుత్వం కుప్ప కూలి బంగ్లాదేశ్ లో అల్లర్లు అన్నీ మొదలై అల్లకల్లోలం అయిన ఏడాది తరువాత తారిఖ్ రహ్మాన్ ఫ్యామిలీ మొత్తం బంగ్లాదేశ్ లోకి అడుగుపెట్టింది.
అతి తక్కువ టైంలోనే :
ఈ మధ్యలోనే ఖలీదా జియా మరణించారు కూడా. అదే సమయంలో తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. చాలా తక్కువ టైం ఎన్నికలకు ఉంది. నిజానికి బీఎన్ఎస్ గెలుస్తుంది అని అనుకున్నారు కానీ తక్కువ సమయం అవడం వల్ల పూర్తిగా జనాల మద్దతు దక్కుతుందా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ రాజకీయాలను ఘర్షణలను చూసిన జనాలు తాత్కాలిక ప్రభుత్వం తీరు మీద తీవ్రంగా మండిపడ్డారు. కరెక్ట్ టైం లో తారిఖ్ రహ్మాన్ ఫ్యామిలీ బంగ్లాకు రావడంతో జనాలు వారి మీద ఆశలు పెద్ద ఎత్తున పెంచుకున్నారు. దాంతో తక్కువ టైం అన్నది చూడలేదు, బీఎన్ఎస్ ని గెలిపించాలి అని నిర్ణయానికి వచ్చారు.
ఆమె దూకుడుతో :
అచ్చం నానమ్మ ఖలీదా జియా మాదిరిగానే మనవరాలు జైమా జర్నాజ్ పరిణతి సాధించారు అన్నట్లుగా ఆమె రాజకీయాల్లో దూకుడు చూపించారు. తండ్రి తారిఖ్ రహ్మాన్ కి తోడుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు కానీ ప్రజలతో మమేకం అయిన విధానం కానీ ప్రజలను ఎంతగానో ఆకాట్టుకుంది. అంతే కాదు వీధులలో కలియ తిరిగారు, జన సమాన్యాన్ని కలిశారు అంతే కాదు రిక్షాలు తొక్కారు, కరపత్రాలు తానే స్వయంగా పంపిణీ చేశారు. అలా ఆమె చేపట్టిన ప్రచారం ఒక సునామీ మాదిరిగా మారింది. ఈ క్రమంలో గట్టిగా పోటీ ఇస్తుంది అనుకున్న జమాత్ ఏ ఇస్లామీ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
ట్రెండింగ్ లో :
ఇక జైమా జర్నాజ్ తన ప్రచారంతో పాటు నాన్నమ ఖలీదా జియాతో తమ అనుబంధం ప్రజలకు ఆమె చేసిన సేవలు ఇవన్నీ ప్రజల ముందు పెట్టారు. దాంతో ఆమె ఉపన్యాసాలు భావోద్వేగాలు ఆమె దూకుడుతో కూడిన వైఖరి ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. బంగ్లాకి ఒక యువ నాయకురాలు దొరికారు అని అంతా అంటున్న మాటగా ఉంది. తండ్రికి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న జైమా జర్నాజ్ రేపటి బంగ్లా దేశ్ కి సరికొత్త ఆశా కిరణంగా చెబుతున్నారు. మొత్తానికి ఆమె చేసిన అద్భుతం బంగ్లాకు నూతన దారి చూపించింది అని అంటున్నారు.