ముప్పు వీడలేదు .. 'లామ్డా' వేరియంట్పై కేంద్రం సంచలన ప్రకటన !
ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ తగ్గుముఖం పట్టినా కూడా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ తీవ్రమైన ఆందోళన కి గురిచేసింది. కరోనా వైరస్ మహమ్మారి కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలను ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో గతవారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా(53 శాతం) కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ, నీతి ఆయోగ్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ప్రకటించారు.
మహారాష్ట్రలో 21 శాతం, కేరళలో 32 శాతం కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జులై 8 నాటికి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 66 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 10 కంటే ఎక్కువగా నమోదైందని వీకే పాల్ వెల్లడించారు. ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కరోనా కొత్త కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. దేశంలో ఇంకా పూర్తిగా కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని, కరోనా మహమ్మారి నియమాలు , నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పాల్ స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, మాస్క్ ధరించకుండా ప్రజలు సంచరించడం ఆందోళనకు గురి చేస్తుంది అని అన్నారు. దేశ వ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ తెలిపారు. కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు చెప్పారు.
అలాగే దేశంలో కరోనా మహమ్మారి రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు తెలిపారు. గర్భిణిలు కూడా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని తెలిపారు. వ్యాక్సిన్ తోనే కరోనా ను పూర్తిగా అరికట్టగలం అన్నారు. ఇక ఇప్పటికే పలు దేశాల్లో ఆందోళనలకు కారణమవుతున్న కరోనా లామ్డా వేరియంట్ ను మనదేశంలో ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు . లామ్డా వేరియంట్ జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకైతే భారత్ లో లామ్డా వేరియంట్ వెలుగుచూసిందనడానికి ఆధారాలు లేవని ప్రకటించారు. పెరూ దేశంలో 80 శాతం లామ్డా కేసులేనని చెప్పారు. సౌత్ అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో కూడా లామ్డా వేరియంట్ గుర్తించారని తెలిపారు. అయితే.. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ చెప్పారు. కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు తెలిపారు. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్న ఆయన.. శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇక దేశంలో నిన్న 42,766 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 45,254 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. మరణాల విషయానికొస్తే, నిన్న 1,206 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 42,90,41,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది.