• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీబీఎస్ఈ 10వ తరగతి...

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు !

By - Tupaki Desk
Update: 2021-04-14 11:45 GMT
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) 10వ తరగతి , అలాగే  12వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా..సీబీఎస్ ఈ 10వ తరగతి పరీక్షలను  రద్దు చేస్తునట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే, 12 వ తేదీ పరీక్షకు సంబంధించిన తుది నిర్ణయం జూన్ 1 న తీసుకోనున్నారు. కానీ ప‌రీక్ష‌ల‌ను మాత్రం వాయిదా వేస్తున్నామ‌ని, మ‌ళ్లీ ప‌రీక్ష‌లు ఎప్పుడుంటాయ‌న్న నిర్ణ‌యం మాత్రం ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని తెలిపింది.  కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో కరోనా మహమ్మారి జోరు భారీగా పెరుగుతుండటం తో  సీబీఎస్ ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా వ్యాప్తి వల్ల ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరగా కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ..ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం తరువాత 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసి 10 వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఢీల్లీతో పాటు చాలా రాష్ట్రాలు ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నపం చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ ఈ 10వ తరగతి విద్యార్థుల కోసం, బోర్డు అభివృద్ధి చేసిన "objective criterion" ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రాతిపదికన విద్యార్ధులకు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని అభ్యర్థికి పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలో కూర్చునే అవకాశం ఇస్తారు. గతేడాది కూడా ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరించింది. షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సి ఉండగా, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 15 వరకు జరగాల్సి ఉంది.
Tags:    
  • CBSE 
  • Class 10 exams 
  • Central Government 
  • Latest News 
  • Telugu News 

Similar News

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS