• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉరిమురిమి అశోక్ బాబు మీద...

ఉరిమురిమి అశోక్ బాబు మీద పడ్డారు...?

By - Tupaki Desk
Update: 2022-01-25 13:35 GMT
అటు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు బస్తీ మే సవాల్ అంటున్నారు. ఇటు చూస్తే ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచినా బే ఖాత‌ర్ అనేస్తున్నారు. దీంతో సర్కార్ పెద్దలకు ఈ ఇష్యూని ఎలా సెటిల్ చేయాలో తెలియక తల బొప్పి కడుతోంది. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా కూడా చర్చలకు ఉద్యోగులు రావడంలేదు. అయితే సీఎం జరిగిన పీయార్సీ చర్చల తరువాత నవ్వుకుంటూ వెళ్ళిన ఉద్యోగులను మార్చేసి తమ ట్రాప్ లోకి లాగేసింది టీడీపీ అని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇక ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సమైక్యాంధ్రా ఉద్యమంలో ఆరడుగుల బుల్లెట్ గా అవతరించి ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మీద వైసీపీ పెద్దలు  పూర్తి డౌట్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో అటు ఉద్యోగుల ఆందోళన జరుగుతున్న కీలక వేళ మాజీ నేత, టీడీపీ నాయకుడు అయిన అశోక్ బాబు మీద పాత  కేసుని తిరగతోడడంతో రాజకీయం ఒక్కసారిగా  వేడెక్కింది.

అశోక్ బాబు మీద తాజాగా సెక్షన్ 477ఆ,465,420 కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఇంతకీ ఈ కేసు ఏంటి అంటే అశోక్ బాబు తాను బీకాం చదవకపోయినా చదివినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు ఒకటి పాతలో నమోదు అయి ఉంది. ఆయన అసిస్టెంట్ కమర్షియల్ ట్సాక్స్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో  కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు అశోక్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి

దాని  మీద మెహర్ కుమార్ అనే ఉద్యోగి గతంలో లోకాయుక్తలో ఫిర్యాదు కూడా చేశరు.  దీంతో దీని మీద  స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించిన మీదట గతేడాది ఆగస్టులో అశోక్ బాబు  కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటికి ఆరు నెలల క్రితం అన్న మాట. ఇక దీని మీద జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలా అటు లోకాయుక్త తో పాటు ఇటు శాఖాపరంగా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్ బాబు మీద సీఐడీ కేసు పెట్టింది. అంతే కాదు ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కూడా తాను బీకాం చదివినట్లుగా అశోక్ బాబు తన ఎన్నికల అఫిడవిట్ లో సైతం పేర్కొన్నారు అని అభియోగాలు ఉన్నాయి. మొత్తానికి సీఐడీ ఈ కీలకమైన టైమ్ చూసి మరీ  అశోక్ బాబు మీద వివిధ సెక్షన్ల పేరుతో కేసులను నమోదు చేయడం విశేషంగానే చూడాలి

ఒక విధంగా ఇది తప్పు ఎవరు చేసినా ఉపేక్షించమని ప్రభుత్వం ఆందోళనకారుల‌కు కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరికలు పంపించినట్లే అంటున్నారు. మొత్తానికి అశోక్ బాబు ని టార్గెట్ చేయడం పట్ల సర్వత్రా చర్చ అవుతోంది. చూడాలి ఇది ఎటు వైపునకు దారితీస్తుందో.
Tags:    
  • Ashok Babu 
  • TDP 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS