ఆ టీ తాగితే కరోనా వైరస్ రాదా?
కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఆపసోపాలు పడుతున్నారు. వ్యాక్సిన్ తయారు చేసి అమెరికాలో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాకు మందు అంటూ పలువురు తమ సంప్రదాయ వైద్యరీతులను చెపుబుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ టీతాగితే కరోనా వైరస్ రాదంటూ కొత్త ప్రచారం మొదలైంది. అసోం టీ తాగితే కరోనా వైరస్ రాదన్న వాదన ఆ రాష్ట్రంలో వినిపిస్తోంది. దానికి బలాన్నిచ్చేలా అసోం రాష్ట్రంలో ఒకరికి కూడా కరోనా వైరస్ సోకలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో అతితక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా అసోం ఉంది. దీనికి కారణం అసోం టీ తాగడమేనని వారు చెబుతున్నారు.
అసోం టీం అనేది ఒక రకమైన బ్లాక్ టీ. దీనికి కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందని వారు చెబుతున్నారు. ఈ మేరకు జోర్హాట్ అసోంలోని టీ రీసెర్చ్ అసోసియేషన్ ట్వీట్ కూడా చేసింది. దీనికి ఓ రీసెర్చ్ పేపర్ ను అటాచ్ చేశారు.
దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అసోం టీ తాగితే కరోనా వైరస్ రాదన్న ప్రచారం ఉధృతమైంది. శాస్త్రీయంగా దీనికి ఎటువంటి ఆధారం లేకున్నా ప్రజలు మాత్రం ఇప్పుడు ఈ అసోం టీ కోసం ఎగబడుతున్నారు.