• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుకు సీఆర్ కొత్త...

చంద్రబాబుకు సీఆర్ కొత్త పేర్లు పెట్టారబ్బా!

By - Tupaki Desk
Update: 2019-10-04 12:48 GMT
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించని రోజంటూ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదేమో. జగన్ అడుగులను చాలా కీన్ గానే పరిశీలిస్తూ వస్తున్న చంద్రబాబు.. ఆయా సందర్భాలను బట్టి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తిరుమల వెంకన్నకు బ్రహ్మోత్సవాల వేళ సీఎం హోదాలో జగన్ పట్టు వస్త్రాలను సమర్పించిన వైనం పైనా బాబు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఒకప్పుడు టీడీపీలోనే కొనసాగిన ప్రస్తుత వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఓ రేంజిలో ఫైర్ కావడంతో పాటుగా చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టేశారనే చెప్పాలి. చంద్రబాబును 40 ఏళ్ల విష వృక్షంగానే కాకుండా విష సంస్కృతికి మర్రి విత్తనంగా పోల్చిన సీఆర్ వ్యాఖ్యలు నిజంగానే సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.

క్రైస్తవుడైన జగన్ హిందువుల దేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు ఎలా సమర్పిస్తారన్నది బాబు ఆరోపణ కాగా... జగన్ క్రైస్తవుడైనా అన్ని మతాల దేవుళ్లను గౌరవిస్తారని, అయినా సీఎం హోదాలో స్వామి వారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తే తప్పేంటని సీఆర్ టీడీపీ అధినేతను నిలదీశారు. జగన్ క్రైస్తవుడు అయినా... అన్ని మతాలను గౌరవించడమే కాకుండా... ఆలయ మర్యాదల ప్రకారమే నడుచుకుంటారని కూడా సీఆర్ చెప్పారు. జగన్ గతంలో తిరుమలకు వెళ్లారని, ఇప్పుడూ వెళ్లారని - భవిష్యత్తులో కూడా ఆయన తిరుమలకు వెళ్లి తీరతారని కూడా సీఆర్ వైసీపీ అధినేత వైఖరిని సుస్పష్టంగానే వినిపించారని చెప్పక తప్పదు. అయినా ఆలయ మర్యాదలను పాటించారా? లేదా? అన్న విషయాన్ని చూడాలి గానీ... సంతకం పెట్టారా? లేదా? అన్నది అనవసర విషయమని కూడా సీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక ఆలయాలపై టీడీపీ హయాంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటలను ప్రస్తావించిన సీఆర్... చంద్రబాబు వైఖరిని కడిగిపారేశారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సదావర్తి భూముల విక్రయం సందర్భంగా పెద్ద స్కామ్ కే పాల్పడ్డారని రామచంద్రయ్య ఆరోపించారు. విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చిన చరిత్ర టీడీపీదేనని కూడా ఆయన ధ్వజమెత్తారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ భూములను చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెట్టారని కూడా సీఆర్ విమర్శించారు. అమ్మవారి కిరీటం మాయమైంది కూడా చంద్రబాబు పాలనలోనేనని ఆయన గుర్తు చేశారు. దుర్గ గుడితో పాటు శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్ర పూజలు చేయించింది కూడా చంద్రబాబేనని కూడా సీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల విషయంలో ఇన్ని దురాగతాలకు పాల్పడ్డ చంద్రబాబు నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటివాడని సీఆర్ ఘాటు వ్యాఖ్య చేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... 40 ఏళ్ల విషవృక్షమని రామచంద్రయ్య తనదైన శైలి వ్యాఖ్యలు సంధించారు.

  


Tags:    
  • C Ramachandraiah 
  • Chandrababu Naidu 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS