• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డ‌బ్బా కొట్టుకోవ‌డం ఆపేయ్...

డ‌బ్బా కొట్టుకోవ‌డం ఆపేయ్ బాబు

By - Tupaki Desk
Update: 2016-09-04 11:20 GMT
ఓటుకు నోటు కేసు విచార‌ణ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును తీవ్రంగా ఇక్క‌ట్ల పాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మాజీ నాయ‌కుడు - ఏపీ కాంగ్రెస్‌ శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య తాజాగా బాబుపై సెటైర్ల మీద సెటైర్లు పేల్చారు.  నేను నిప్పు... నిజాయతీ పరుడినని డబ్బా కొట్టుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు ఎందుకని అప్పీలుకు వెళ్తున్నాడో ప్రజలకు వివరించాలని  కోరారు. నీవు నిజాయతీ పరుడి వైతే ఓటుకు నోటు కేసులో ఎందుకు అంతగా భయపడాల్సి వస్తోందని రామ‌చంద్ర‌య్య‌ ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కేంద్రం రాజీ చేసినట్లుందని రామ‌చంద్ర‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సి ఉండగా చంద్ర‌బాబు మాత్రం పరుగు పరుగున విజయవాడకు ప‌రిపాల‌న తరలించారని అన్నారు. ఆయన స్వలాభం కోసం ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్యానించారు.  కేసులో నిర్ధోషత్వాన్ని నిరూపించుకోవాలంటే విచారణ ఎదుర్కొని స‌చ్చీలుడిగా నిరూపించుకోవాలని రామ‌చంద్ర‌య్య‌ డిమాండ్‌ చేశారు. వంద కోట్ల ఖర్చుపెట్టి ఫాంహౌస్‌ ను నిర్మించుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఎన్నో ఆరోపణలు వస్తున్న లింగమనేని ఎస్టేట్స్‌ లోని నివాసం ఉంటుండటంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లింగమనేని ఎస్టేట్స్‌ లో అవినీతి మరకలున్నాయని, ఇల్లీగల్‌ అయినది ఇప్పుడు లీగల్‌ ఎలా అయిందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ప్రభుత్వ నిధులతో న్యాయవాదులను పెట్టుకునే సత్తా నీకుంది కానీ ఎక్కువ డబ్బులు చెల్లించి న్యాయవాదిని పెట్టుకునే స్థోమత త‌మ‌కు లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. పుష్కరాల పేరుతో రూ.18 వేల కోట్లు సీఎం చంద్ర‌బాబు నాయుడు ఉత్త‌పుణ్యాన‌ ఖర్చు చేశాడని రామ‌చంద్ర‌య్య‌ ఆరోపించారు. పుష్కరాల్లో పటాసుల కోసం 80 లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. కపట నాటకాలను పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయాలని కోరారు.
Tags:    
  • C Ramachandraiah 
  • Chandrababu naidu 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS