బస్ కండక్టర్ లీలలు మామూ లుగా లేవు.. యువతులతో శృంగారం.. పోర్న్ సైట్లకు వీడియోల విక్రయం
సమాజంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా ఓ బస్ కండక్టర్ అరాచకాలు బయటపడ్డాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను లోబర్చుకుంటున్న ఈ దుర్మార్గుడు వారితో శృంగారంలో పాల్గొంటున్నాడు. రహస్యంగా వీడియోలు తీసి.. ఈ వీడియోలను పోర్న్ సైట్లకు అమ్ముకుంటున్నాడు. ఈ దారుణ ఘటన తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు దాదాపు 62 పోర్న్ వీడియోలు పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని థానేలో జరిగింది ఈ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్‌లో మిలిండ్ జాదే అనే బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. జాదే ఉన్నత విద్యావంతుడు కూడా. ఎంఏ, బీఎడ్ డిగ్రీలు చేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంతకాలంగా మహిళలను లోబర్చుకుంటున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారితో శృంగారంలో పాల్గొనేవాడు. ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు.
వీడియోలో తాను మాత్రం కనిపించకుండా బ్లర్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ మహిళ వీడియోను ఆమె బంధువులు పోర్న్ సైట్లలో చూశారు. వారు సదరు మహిళకు విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం బయటపడింది. మిలింద్ బాదే తన భార్యతో కలిసి ఈ దందా చేస్తున్నట్టు సమాచారం. భార్య తనకు తెలిసిన వాళ్లను పరిచయం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మిలింద్ జాదే ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 62 పోర్న్ క్లిప్పింగ్స్ అప్ లోడ్ చేసి రూ. 5 లక్షలు సంపాదించినట్టు మిలింద్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోలను సైట్ల నుంచి తొలగించారు. ఇటువంటి వ్యక్తుల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.