అసెంబ్లీలో టీడీపీ దోపిడీ కథ చెప్పిన బుగ్గన

Update: 2020-01-20 09:00 GMT
ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ ఉద్దేశించిన బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి ఎందుకు 3 రాజధానులు అవసరం అనేది సవివరంగా వివరించారు. అమరావతిపై టీడీపీ నేతలు ఎందుకు ఆందోళన చేస్తున్నదీ వివరించి ఎండగట్టారు.

అమరావతి రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని.. రాజధానిని ప్రకటించే ముందే కృష్ణ,గుంటూరు జిల్లాల్లో 4070 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన మండపడ్డారు.

ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే అమరావతిపై కుట్ర జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే రాజధానిని అమరావతిలో పెట్టాలని డిసైడ్ అయ్యారని ఆరోపించారు. రాజధానిని ప్రకటించడానికి ముందే టిడిపి నాయకులు అమరావతిలోని భూములను నామమాత్రపు ధరలకు ఏకకాలంలో కొని అమాయక రాజధాని రైతులను మోసం చేశాడని వివరించారు. ఏపీ రాజధాని ముందే భూములను లక్షల్లో కొనేసి ఆ తర్వాత ఒక ఎకరం భూమిని 10 కోట్ల రూపాయలకు టీడీపీ నేతలు అమ్ముకున్నారని.. అలా ఏకంగా రూ .40,000 కోట్ల  కుంభకోణాన్ని టీడీపీ నేతలు చేశారని బుగ్గన సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ప్రకటనకు ముందే హెరిటేజ్ గ్రూప్ పేరిట కాంటెరు గ్రామంలో 14.2 ఎకరాలను కొనుగోలు చేశారని   బుగ్గన ఆరోపించారు.

 ఇక చంద్రబాబు పాలనలో రాజధాని ఎంత అక్రమంగా ప్రకటించారో బుగ్గన వివరించారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధానికి పనికిరాని ప్రదేశంగా స్పష్టం చేసిందని.. అయినా  ఆ కమిటీని విస్మరించి, చంద్రబాబు తన సొంత వ్యాపారస్థులతో కలిసి మంత్రి నారాయణ కమిటీని నియమించారని బుగ్గన ధ్వజమెత్తారు.  వారంతా కుట్రపన్ని అమరావతిని సూచించారని.. అక్కడ భూములు కొన్నారని విమర్శించారు. రాజధాని ప్రకటనకు ముందే చాలా మంది టీడీపీ నాయకులు కొన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కేవలం  ఇన్ సైడర్  ట్రేడింగ్‌ లో పాల్గొనడమే కాదు, ' ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారని' బుగ్గన సంచలన ఆరోపణలు చేశారు.

నారా లోకేష్ యొక్క బినామి వేమూరి ప్రసాద్ కూడా వందల ఎకరాలను కొన్నారని బుగ్గన అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, ధుళిపాల నరేంద్ర, పరిటాల సునీత, పుట్టా సుధాకర్ యాదవ్, జీవీ అంజనేయులు రాజధాని ప్రకటనకు ముందే భూములను కొన్నాడని ఆ వివరాలను మంత్రి బుగ్గన బయటపెట్టి సంచలనం సృష్టించారు.
Tags:    

Similar News