నిన్న చైనా, నేడు అమెరికా..భయపెడుతున్న బుబోనిక్ ప్లేగు !

Update: 2020-07-16 00:30 GMT
ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి గజగజవణికిపోతుంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచంలోని ప్రతి దేశం కూడా వణికిపోతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకి విలవిలాడుతోంది. ఈ సమయంలోనే చైనా తో తాజాగా మరోసారి బుబోనిక్ ప్లేగు వ్యాప్తి మొదలైన సంగతి తెలిసిందే. ఈ బుబోనిక్ ప్లేగు మొదటి కేసు తాజాగా అమెరికా లో కూడా నమోదు అయింది. కొల రాడోలోని ఓ ఉడుతకు బుబోనిక్ ప్లేగు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మోరిసన్ నగరంలోని ఓ ఉడుతకు జులై 11న బుబోనిక్ ప్లేగు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు జఫర్సన్ కంట్రీ పబ్లిక్ హెల్త్ విభాగం వెల్లడించినట్టు సీఎన్ ఎన్ మీడియా తెలిపింది.

ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి ఈగల ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకర వ్యాధిగా ఈ ప్లేగును డబ్ల్యూహెచ్ ఓ గుర్తించింది. జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా 800 ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగు గా ఇప్పుడు విరుచుకుపడింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సరైన నిబంధనలు పాటించకపోతే జంతువుల నుంచి సంక్రమించే బుబోనిక్ ప్లేగు జంతువులు లేదా మనుషులకు వ్యాపించగలదు. ఈ వ్యాధి ఈగలు, సోకిన జంతువుల నుంచి వ్యాపిస్తుంది. యాంటీబయాటిక్స్‌ తో త్వరగా చికిత్స చేస్తే మరణాన్ని నివారించగలవు.

ఈ వ్యాధి సోకితే .. గజ్జలు, చంకలు లేదా మెడపై కోడి గుడ్ల మాదిరిగా శోషరస కణుపులు పెరుగుతాయి.. ఇవి మృదువుగా, వెచ్చగా ఉంటాయి. మరికొందరిలో జ్వరం, చలి, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు తదితర లక్షణాలు బయటపడతాయి. ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి నిర్ధారణ కాగా వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు చైనా జులై 7న ప్రకటించింది. మరోసారి ప్లేగు వ్యాధి వ్యాపిస్తోందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అధికారంగా ఏటా 1000 నుంచి 2,000 కేసులు నమోదవుతున్నాయని, లెక్కల్లోకి రాని కేసులు కూడా చాలా ఉన్నాయని తెలిపింది.
Tags:    

Similar News