గో కార్టింగ్‌ సరదా బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు తీసింది

Update: 2020-10-08 13:48 GMT
గో కార్టింగ్‌ సరదా బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఈ సంఘటన హైదరాబాద్  నగర శివారులోని గుర్రంగూడ గో కార్టింగ్‌ ప్లే జోన్‌ లో చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ చదివే‌ విద్యార్థిని శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్‌ కు వెళ్లింది. గో కార్టింగ్‌  చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారు టైర్‌ కు యువతి తల వెంట్రుకలు చుట్టుకున్నాయి. వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీ వర్షిణి తల బలంగా నేలకు తగిలింది.  

దీనితో ,ఆమె పెట్టుకున్నహెల్మెట్‌ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో శ్రీ వర్షిణిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే , తలకి తీవ్రమైన గాయం కావడంతో ఆ యువతీ మరణించింది. ఇక, మరోవైపు గో కార్టింగ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News