సాగర్ బరిలో తమ్ముడి పేరు ఫైనల్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. నామినేష్ల గడువుకు ఒకరోజు ముందు కానీ కసరత్తు మీద కసరత్తు చేసి.. అభ్యర్థిని ఫైనల్ చేయకుండా టెన్షన్ పుట్టించే తెలుగుదేశం పార్టీ తన తీరుకు భిన్నంగా.. నోటిఫికేషన్ విడుదల కాక ముందే.. అభ్యర్థిని ఫైనల్ చేసేసిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.
సాగర్ ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా మువ్వా అరుణ్ కుమార్ ను పార్టీ ఫైనల్ చేసింది. నల్గొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ ను ఎంపిక చేశారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా.. నాగార్జునసాగర్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఉన్న అవకాశం తక్కువే అయినా.. ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై.. తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటన్న దానిపై ఒక స్పష్టత రావటం ఖాయం. గెలుపోటముల్ని పక్కన పెడితే.. తెలంగాణలో టీడీపీ ఉనికి ఎంతన్న విషయాన్ని తాజా ఉప ఎన్నిక తేల్చనుందని చెప్పక తప్పదు.