అదిరిపోయే స్టెప్స్ తో అలరించిన వధువు .. కాసేపటికే విషాదం..
మరికొద్ది గంటల్లో పెళ్లి .. అక్కడంతా సంతోష వాతావరణం నెలకొంది. వధువు, వరుడు కుటుంబసభ్యులతో సందడి సందడి నెలకొంది. కానీ, అంతలోనే విషాదం నెలకొంది. పెళ్లి మండపానికి వస్తున్న వధువు కారులో నుంచే డ్యాన్స్ చేస్తుండగా ఇతరులు కూడా డ్యాన్స్ చేశారు. అంతలో ఓ కారు వారిపైకి వేగంగా దూసుకరావడంతో ఒకరు మృతి చెందారు. దీనితో పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో నైమండీ ప్రాంతంలో అంకుర్ అనే వ్యక్తితో హేమ అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది.
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో 2021, ఫిబ్రవరి 16వ తేదీ మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. వధువు పెళ్ళి బృందం కళ్యాణ మండపానికి కారులో బయలుదేరారు. బంధువులు, మిత్రులందరు సంతోషంగా డాన్సులు చేస్తున్నారు. వధువు ప్రత్యేక కాస్టూమ్స్, సన్ గ్లాసెస్ ధరించి కారులోని రూఫ్ పైన నిలబడి ఉత్సాహంతో స్టేప్పులు వేస్తుంది. కానీ..అకాస్మాత్తుగా ఒక కారు వేగంగా పెద్ద శబ్ధం చేసుకుంటు వధువు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. రెప్పపాటులో అక్కడి వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ఫుల్ జోష్ తో డాన్స్‌లు చేస్తున్న వారు కాస్త, దూరంగా ఎగిరిపడ్డారు. కాగా, ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తు పెళ్ళికూతురు మాత్రం దీని నుంచి క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతొంది.