బ్రేకింగ్: ఢిల్లీలో భారీ పేలుడు

Update: 2021-01-29 13:51 GMT
ఢిల్లీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 కార్లు ధ్వంసమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు.ఈ పేలుడులో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఓవైపు విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గణతంత్ర దినోత్సవాలు ఓవైపు.. రైతుల ఆందోళనలు మరోవైపు సాగుతున్న వేళ ఢిల్లీలో ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది. దీనివెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేదా ఏదైనా అనుకోని ప్రమాదమా? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News