డీఎన్ఏ టెస్టు చేయించుకున్న కొడుకు.. తర్వాత జరిగిందంతా సినిమా టిక్!

Update: 2023-05-29 10:31 GMT
దీన్ని చదివినంతనే ఏదో ఫాంటసీ మూవీ సినిమా చూసినట్లుగా ఫీల్ కాక మానదు. నిజ జీవితంలో ఇలా జరిగే ఛాన్సులు ఉండవని భావించటం ఖాయం. కానీ.. ఇదంతా నిజంగా అంటే నిజంగా జరిగింది. అమెరికాకు చెందిన ఒక యువకుడు ఎందుకు చేశాడో కానీ.. తన డీఎన్ఏను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలానే చేయించుకున్నాడు. అతడికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది రిపోర్టులు వచ్చిన తర్వాత.

ఎందుకంటే.. తనను పెంచి పెద్దచేసిన తండ్రి తన తండ్రి కాదని.. తన పుట్టుకకు కారణమైన వ్యక్తి ఇంకెవరో అన్న విషయాన్ని గుర్తించారు. తన తల్లి తనను జన్మను ఇవ్వటం కోసం ఎవరో స్పెర్మ్ దాత సాయాన్ని తీసుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు.

దీంతో.. తన మాదిరే సదరు స్పెర్మ్ డోనర్ ఇంకెవరికి ఇచ్చి ఉంటాడన్న ఆరా తీసిన అతను.. మొత్తంగా 35 మంది తనలాంటి వారు ఉన్న విషయాన్ని గుర్తించాడు. వారి వివరాలు సేకరించి.. తామంతా తోబుట్టువులమన్న విషయాన్ని అందరితో షేర్ చేసి.. ఆన్ లైన్ లో చాట్ చేసుకున్నారు.

అనంతరం తాను చేసిన పని  గురించి అతను సోషల్ మీడియాలో ఓపెన్ అయ్యాడు. తనను పెంచి పెద్ద చేసిన తండ్రికి ఇదెంతో ఇబ్బందికరమైన పరిస్థితి అని.. ఈ విషయం ఇప్పటివరకు అతనికి తెలీదని చెప్పారు.

అదే సమయంలో తన పుట్టుకకు కారణమైన బయోలాజికల్ తండ్రి మీద తనకు ఎలాంటి ఎమోషన్ లేదన్న అతను.. తనను పెంచి పోషించి.. పెద్ద చేసిన తండ్రిపైనే తన ప్రేమంతా అని వెల్లడించారు.

తన బయలాజికల్ తండ్రికి మొత్తం 35 మంది జన్మకు కారణమన్న విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు. ఇతగాడి పోస్టుమీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మాత్రం.. 35 మంది తోబుట్టువులను ఆన్ లైన్ లో కలవటం.. అందరూ కలిసి మాట్లాడుకోవటం మాత్రం సినిమాటిక్ సీన్ గా మాత్రం చెప్పక తప్పదు.

Similar News