ఆ రెండు ట‌వ‌ర్ల‌నూ కూల్చాల్సిందే : సుప్రీంకోర్టు

Update: 2021-10-05 05:31 GMT
రియాల్టీ సంస్థ సూపర్‌ టెక్ లిమిటెడ్‌ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నోయిడాలో కంపెనీ నిర్మించిన రెండు 40 అంతస్తుల భవంతులను పడగొట్టాల్సిందిగా ఆగస్టు31న ఆదేశించి సుప్రీం కోర్టు.. ఆ ఆదేశాలను సవరించాలని కోరుతూ సూపర్‌ టెక్ పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్ ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రెండు టవర్లను కూల్చడం కంటే ఒక టవర్‌లోని 224 ఫ్లాట్లను, వాటి కమ్యూనిటీ ఏరియాను కూల్చేస్తామని తన పిటిషన్‌లో సూపర్‌టెక్ తెలిపింది.

ఇతర అప్లికేషన్లు, స్పష్టత కోసం వేసిన అప్లికేషన్ల రూపంలో ఉన్న ఈ పిటిషన్ తీర్పుపై సమీక్ష కోరకూడదంటూ కొట్టేసింది కోర్టు. అయితే నిర్మాణ సంస్థ మాత్రం కూల్చివేత విషయంపై ఆలోచనలో పడింది. చుట్టూ నివాసాలు ఉండటంతో బాంబులు పెట్టి కూల్చడం కుదరదని.. ఇటుక ఇటుక తీసి కూల్చాలంటే చాలా ఖర్చు అవుతుందని.. ఇప్పటికే నిర్మాణం కోసం చాలా ఖర్చు చేశామని.. మరింత ఖర్చు కాకుండా ఉండేందుకు తీర్పుపై సమీక్ష కోరినట్లు తెలిపింది సంస్థ. ఈ రెండు టవర్లు నోయిడా భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వాటిని కూల్చేయాల్సిందే అంటూ ఆగస్ట్ 31న తీర్పు వెలువరించింది.

నోయిడాలో తాము నిర్మించిన రెండు 40 అంత‌స్తుల ట‌వ‌ర్ల‌ను కూల్చేయాల్సిందిగా గ‌తంలో ఇచ్చిన ఆదేశాల‌ను స‌వ‌రించాల‌ని కోరుతూ సూప‌ర్‌ టెక్ వేసిన పిటిష‌న్‌ ను సోమ‌వారం అత్యున్న‌త న్యాయ‌స్థానం కొట్టేసింది. రెండు ట‌వ‌ర్ల‌ను కూల్చ‌డం కంటే ఒక ట‌వ‌ర్‌ లోని 224 ఫ్లాట్ల‌ను, వాటి క‌మ్యూనిటీ ఏరియాను కూల్చేస్తామ‌ని త‌న పిటిష‌న్‌ లో సూప‌ర్‌ టెక్ తెలిపింది. అయితే జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న‌ల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం అంగీక‌రించ‌లేదు. త‌మ ట‌వ‌ర్‌-17 ఇత‌ర నివాస ప్రాంతాల ప‌క్క‌నే ఉన్న కార‌ణంగా దానిని పేలుడు ప‌దార్థాల సాయంతో పేల్చ‌డం కుద‌ర‌ద‌ని, ఒక్కో ఇటుక లెక్క‌న కూల్చాలంటే చాలా ఖ‌ర్చ‌వుతుంద‌ని త‌న పిటిష‌న్‌లో సూప‌ర్‌ టెక్ తెలిపింది. ఇప్ప‌టికే ఈ ట‌వ‌ర్ల నిర్మాణానికి భారీగా ఖ‌ర్చ‌యింద‌ని, అందుకే మ‌రింత ఖ‌ర్చును అడ్డుకోవ‌డం కోస‌మే తాము తీర్పుపై సమీక్ష కోరిన‌ట్లు తెలిపింది. ఈ రెండు ట‌వ‌ర్లు నోయిడా భ‌వ‌న నిర్మాణ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


Tags:    

Similar News