పడవ ప్రమాదం జరిగిందిలా..!

Update: 2019-09-16 07:02 GMT
తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. అయితే ఇప్పటివరకు సహాయకబృందాలు 12 మృతదేహాలను వెలికితీశాయి.

అయితే అసలు లాంచీలో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు అని ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు, అక్కడే ఉన్న మత్స్యకారులు చెబుతున్నారు.

కచ్చలూరు వద్ద గోదావరి రెండు కొండల మధ్యన మలుపు తిరుగుతుంటుంది. దీంతో పైనుంచి వచ్చే వరద గోదావరి ఇక్కడ ఉధృతమైన వేగంతో టర్న్ అవుతుంది. దాని ధాటికి సుడిగుండాలు ఏర్పడుతాయి. పైనుంచి 5 లక్షల క్కూసెక్కుల వరదకు భారీగా సుడిగుండాలు ఏర్పడి పడవను అతలాకుతలం చేసింది. ఆ కుదుపుకు ప్రయాణికులంతా ఒక పక్కకు రావడంతో పడవ బోల్తా పడినట్టు ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

పడవ మొదట కుదుపులకు ఒక పక్కకు ఒరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆ తర్వాత పూర్తిగా బోర్లా పడింది. దీంతో పడవ పైన ఉన్న 20 నుంచి 30 వరకు అందరూ నీళ్లలో పడిపోయారు. వీరికి లైఫ్ జాకెట్లు ఉండడంతో  నీటిపై తేలియాడారు. అయితే 40 మందికి పైగా పడవ లోపల బంధీగా ఉండిపోయారు. పడవ ఒకవైపునకు వంగుతూ మునిగిపోవడంతో పడవ పైన ఉన్న వాళ్లు మాత్రమే బతికి బయటపడ్డారు. స్థానిక మత్య్యకారులు బోట్లతో వచ్చి వారిని రక్షించారు. అయితే బోటులో పల ఉన్న వారు మాత్రం పడవతోపాటే నదిలో మునిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 65 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. పడవ పైన ఉన్న వాళ్లు అందరూ నీళ్లలో పడగా.. లైఫ్ జాకెట్లు ఉన్న వారిని స్థానిక మత్య్సకారులు రక్షించారు. ఇక పడవ లోపల ఉన్న వారు మాత్రం పడవ బోల్తా పడి మునిగిపోవడంతో తప్పించుకోవడం వీలు కాక గల్లంతయ్యారని తెలిపాడు.

ప్రస్తుతం కచ్చలూరు వద్ద గోదావరి 300 అడుగుల లోతు వరకూ ఉందట.. అక్కడ మునిగిన పడవను బయటకు తీయడం కష్టమని మత్య్యకారులు చెబుతున్నారు. ఆబోటు  బయటకు తీస్తేనే అందులో ఎంతమంది ఉన్నారు. నీళ్లలో మునిగిపోయారా అన్న విషయం తెలుస్తుంది. సో ప్రత్యక్ష సాక్షలు చెప్పిన ప్రకారం.. బోటు లోపల ఉన్న వారంతా నీటిలో మునిగిపోయారని సమాచారం.
    

Tags:    

Similar News