సీఎం ఫామ్ హౌస్ లో ఏం పండిస్తున్నారో చెప్పారు
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు కొత్త కొత్త అంశాల మీదకు చర్చకు తీసుకెళ్లేలా చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన బీజేపీ.. కొత్త ఉత్సాహంతో ఉరుకులు పరుగులు తీస్తోంది. తెలంగాణ అధికారపక్షంపై తమకు లభించిన అధిక్యాన్ని ఏ మాత్రం చేజార్చుకోకూడదన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత అంశాల పైనా బీజేపీ నేతలు ఇప్పుడు టార్గెట్ చేస్తున్న వైనం.. కొత్త చర్చకు తెర తీయటం ఖాయమంటున్నారు.
ఎందుకంటే.. ఇప్పటివరకు టచ్ చేయని అంశాల్ని వారు మాట్లాడటం.. రానున్న రోజుల్లో ఈ అంశాలపై మరింత ఫోకస్ చేయటం ఖాయమంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కమ్ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫాంహౌస్ కు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా సన్న బియ్యం సాగు చేయాలని ముఖ్యమంత్రిచెప్పారని.. కానీ.. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో దొడ్డు బియ్యం పండించారని.. రైతులకేమో సన్నబియ్యం సాగు చేయాలని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్ర ఖజానాను పాతబస్తీలో ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పి.. ఏ పాయింట్ చెబితే ఇట్టే కనెక్టు అవుతారో..ఆయా పాయింట్లనుప్రస్తావించటం గమనార్హం. పాతబస్తీలో వసూలు అయ్యే ఇంటిపన్నులు.. నీళ్ల పన్ను.. విద్యుత్ బిల్లులతో వచ్చే ఆదాయం లెక్కలు చెప్పాలన్నారు. పాత నగరంలో వచ్చే ఆదాయం.. కొత్త నగరంలో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎదురుకాని కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చిన బండి సంజయ్ మాటలకు టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.