దుమారంరేపుతోన్న బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్‌.. రాజీనామా !

Update: 2021-08-25 06:44 GMT
తమిళనాడు లో ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేటీ రాఘ‌వ‌న్ త‌న ఇంటిలో అర్థ‌న‌గ్నంగా కూర్చుని పార్టీ జిల్లా నాయ‌కురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్ మంగ‌ళ‌వారం వైర‌ల్ అయ్యింది. దీంతో అక్క‌డ పెద్ద దుమారం రేగింది. పార్టీ సభ్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేటీ రాఘవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి ఫిర్యాదు చేశారు. తీవ్ర రాజకీయ దుమారం నేపథ్యంలో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి కేటీ రాఘవన్ రాజీనామా చేశారు.

ఓ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్న మ‌ద‌న్ అనే వ్య‌క్తి త‌న చానెల్‌ లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ స్టింగ్ వీడియోలో స‌ద‌రు రాఘ‌వ‌న్‌- మ‌హిళ మ‌ధ్య ఆడియో ఏమీ వినిపించ‌డం లేదు. అయితే.. సంజ్ఞ‌ల ద్వారా మ‌హిళ ముందు "షో" చేస్తున్న‌ట్లు వీడియో క‌నిపించింది. ఆ దృశ్యాన్ని చూడ‌టంతో పాటు రాఘ‌వ‌న్ డిమాండ్ విన‌గానే ఆ మ‌హిళ ఫోన్ పెట్టేశార‌ని తెలిపారు. కాగా.. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో రాఘ‌వ‌న్ వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌హిళ‌లతో అస‌భ్యంగా విడీయో కాల్ మాట్లాడిన రాఘ‌వ‌న్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కే అన్నామలై ఆదేశాల మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అన్నామలై‌తో భేటీ తర్వాత ట్విట్టర్‌లో తన రాజీనామా నిర్ణయాన్ని రవిచంద్రన్ ప్రకటించారు. తనతో పాటు పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ వీడియోను విడుదల చేశారని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని, అసలు నిజం ఏమిటో త్వరలోనే తెలుస్తుంది అని అన్నారు. తాను ఏంటో తన సన్నిహితులు, తమిళనాడు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పార్టీ నేతలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు తాను ఈ వీడియో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. కాగా కేటీ రాఘవన్‌ వ్యవహారంపై అన్నామలై విచారణ బృందాన్ని నియమించారు. అయితే, రాబోయే రోజుల్లో తమిళనాడు లో కమల దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇలాంటి సమయంలో బీజేపీకి ఈ వీడియో చాటింగ్ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.

మంగళవారం మదన్‌ డైరీ శీర్షికతో ఆ పాత్రికేయుడు వెలువరించిన వీడియోలో కేటీ రాఘవన్‌ ఓ జిల్లా శాఖకు చెందిన మహిళా నాయకురాలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. రాఘవన్‌ ఆ సమయంలో పూజగదిలో అర్ధనగ్నంగా సోఫాలో కూర్చుని ఆ మహిళతో మాట్లాడారు. తొలుత తనకు కాల్‌ చేయాలంటూ రాఘవన్‌ వాట్సాప్‌ సందేశాలు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఫోన్‌ చేయగా, రాఘవన్‌ తీయకుండా కాసేపయ్యాక ఆమెకు వీడియో కాల్‌ చేసి మాట్లాడే దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ మహిళతో సైగలు చేసి రాఘవన్‌ అడగటం, అందుకు ఆ మహిళ నిరా కరించటం వంటి దృశ్యాలున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ వీడియో వివాదాన్ని చట్ట ప్రకారం ఎదుర్కొని తన నిజాయతీని నిరూపించుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. రాఘవన్‌ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై ఓ ప్రకటన విడుదల చేశారు.


Tags:    

Similar News