నో పాలిటిక్స్ అంటున్న మెగా పవర్ స్టార్... అయినా బీజేపీ...?

Update: 2023-03-18 16:04 GMT
రాజకీయాలు అన్నవి ఇపుడు అన్ని రంగాలలోనూ అంతర్భాగం అయిపోయాయి. ఒకపుడు ఏ రంగంలో  వారు   ఆ రంగం ఉండేవారు. రాజకీయ నాయకత్వం గ్రౌండ్ లెవెల్ లో తయారై అగ్రశ్రేణి నేతలుగా మారేవారు. అయితే కాలగమనంలో చూస్తే లీడర్స్ క్షేత్ర స్థాయిలో నుంచి రావడం లేదు. వారసత్వంగానో లేక మరో రంగం లో అగ్రగణ్యులుగా ఉంటూ ఈ వైపు చూస్తున్న వారో కావడమే జరుగుతోంది.

ఆ రకమైన నేపథ్యంలో పూర్తి వెసులుబాటు సినిమా హీరోలకే ఉంది అని చెప్పవచ్చు. క్రికెటర్స్ కూడా ఆల్ ఓవర్ గా సెలిబ్రిటీస్ గా ఉన్నా వారు ప్రాంతాలను దాటేసిన అభిమానాన్ని పొందుతారు. అదే హీరోలు అయితే తమ ప్రాంతాలలో డెమ్మీ గాడ్స్ గా నీరాజనాలు అందుకుంటూంటారు. అందుకే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు వచ్చే వారు బాగా పెరుగుతున్నారు.

అలా తమిళనాట మొదలైన ఈ అనవాయితీ తెలుగునాట అన్న నందమూరి తారకరాముడితో మరింత ముందుకు వెళ్లింది. ఇపుడు చూస్తే మెగా ఫ్యామిలీ నుంచి కూడా రాజకీయ నాయకులు వస్తున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కొంతవరకూ సక్సెస్ అయినా కొనసాగించలేకపోయారు. ఆ కొరతను తీర్చేందుకు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నారు. పవన్ వెండి తెర మీద పవర్ స్టార్.

అలాంటి ఆయన దశాబ్ద కాలంగా జనసేన రాజకీయాలలో మునిగి తేలుతున్నారు. 2024 ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ మీద బీజేపీ కేంద్ర పెద్దలు మనసు పారేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకు రాజకీయాల మీద మోజు తీరిపోయింది అని చెబుతున్నా ఆయనను కమలం పార్టీ పెద్దలు వదలడంలేదు.

లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆహ్వానం మీద ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో నంబర్ వన్ కేంద్ర ప్రభుత్వంలో నంబర్ టూ గా ఉన్న అమిత్ షా చాలా అంశాలు ఆయనతో ముచ్చటించినట్లుగా తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ కి అస్కార్ అవార్డు రావడం పట్ల అభినందించడానికి ఈ భేటీ అని చెబుతున్నా   అంత కంటే ఎక్కువే అన్నట్లుగానే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడం విశేషం.

ఇక దీనికంటే ముందు ఢిల్లీలో జరిగిన ఇండియా టు డే కాంక్లేవ్ కి రాం చరణ్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడ ఆయన మీద పొలిటికల్ క్వశన్స్ కూడా వచ్చి పడ్డాయి. నందమూరి ఫ్యామిలీ పొలిటికల్ గా సక్సెస్ అయింది మెగా ఫ్యామిలీ ఎందుకు పొలిటికల్ గా సక్సెస్ కాలేదు అంటూ మెగస్టార్ చిరంజీవి గురించి ప్రశ్నలు అడగడం జరిగింది.  ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ఈ క్లిష్టమైన ప్రశ్నకు రాం చరణ్ తెలివైన ఆన్సర్ చెప్పారు.

దయచేసి రాజకీయాలు గురించి మాట్లాడొద్దు సార్. మనం సినిమాల గురించే మాట్లాడుదామని చెప్పడంతో ఆ టాపిక్ ఆగిపోయింది. అయితే ఇక్కడ చర్చ ఏంటి అంటే రాం చరణ్ ఎందుకు రాజకీయాలు వద్దు అని అంత విముఖత ప్రదర్శించారు అని. నిజానికి రాజకీయాలు సినిమాలు రెండూ పూర్తిగా మిళితం అయిన సందర్భం ఉంది.
4

చరణ్ చిన్నాన్న పవన్ సొంతంగా జనసేన ఏర్పాటు చేసి రాజకీయంగా పోరాడుతున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ కేంద్ర పెద్దల కళ్ళు అన్నీ మెగా ఫ్యామిలీ మీదనే ఉన్నాయి. ఏపీలో ఎలాగైనా గట్టిగా నిలబడదామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు మెగా ఫ్యామిలీ అండను కోరుకుంటున్నారు. కానీ ఆ ఫ్యామిలీలో రెండవ తరం హీరోగా ఆలిండియానే కాదు, ఆస్కార్ తో గ్లోబల్ లెవెల్ లో సైతం తన సత్తా చాటిన రాం చరణ్ అయితే నో పాలిటిక్స్ అనేస్తున్నారు.

మరి ఇన్ని తెలిసి కూడా బీజేపీ ఇంకా మెగా ఫ్యామిలీ వెంట పడుతోంది అంటే వారికి ఉన్న నమ్మకం ఏంటో మరి అని అంటున్నారు అంతా. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ మద్దతు ఇండైరెక్ట్ గా అయినా జనసేనకే ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్న మాట. సో ఏ రాజకీయ పార్టీ మెగా కాంపౌండ్ వైపు చూసినా నిరాశ తప్పదనే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News