బీజేపీ ఆరోపణలకు వాల్యూ ఉందా ?

Update: 2022-09-11 06:35 GMT
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక పనికిమాలిన ఆరోపణలు చేస్తునే ఉంది. మొదట్లో రాహుల్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు రు. 42 వేలంటు గోల చేసింది. దానిని కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. దాంతో తాజాగా రాహుల్ తో భేటీ అయిన ఒక పాస్టర్ చేసిన కామెంట్లపై గోల మొదలుపెట్టింది. అగ్రనేతతో జార్జ్ పొన్నియన్ అనే పాస్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జార్జ్ మాట్లాడుతూ 'జీసన్ నిజమైన దేవుడు..మిగిలిన దేవుళ్ళలా కాదు' అన్నారట.

జార్జ్ చేసిన కామెంట్లను పట్టుకుని బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. మత ప్రభోదకుడైన జార్జ్ జీసస్ ను కీర్తించకుండా ఇంకే దేవుళ్ళని కీర్తిస్తారు ? అలాగని హిందు దేవుళ్ళని ఏమీ అవమానించలేదు కదా. తనకిష్టమైన జీససే నిజమైన దేవుడని చెప్పుండచ్చు. ముస్లిం మత పెద్దలు మాట్లాడినపుడు ప్రపంచం మొత్తానికి అల్లా ఒక్కడే దేవుడంటారు. హిందు మతపెద్దలు మాట్లాడినపుడు హిందు దేవుళ్ళే గొప్పవాళ్ళంటారు.

ఏ మతస్తులు తమ దేవుడే గొప్ప అనటంలో విచిత్రమేముంది ? ఇంతోటి దానికి జార్జ్ తో మాట్లాడిన రాహుల్ ను తప్పుపట్టడం, మత విభజన వచ్చేట్లుగా మాట్లాడటం బీజేపీ నేతలకే చెల్లింది. చూస్తుంటే రాహుల్ పాదయాత్రను బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నట్లున్నారు. రాహుల్ పాదయాత్రకు జన స్పందన కూడా బాగా ఉంది. జనాలు ఇలా స్పందిచడం బీజేపీ నేతలకు నచ్చినట్లు లేదు.

రాహుల్ చేస్తున్నదే ఆఖరిపోరాటం. దాదాపు నేలమట్టమైపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుత్తేజం కల్పించటమే ఏకైక టార్గెట్ గా రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టారు. జనాల్లో తనను తాను లీడర్ గా  ప్రూవ్ చేసుకోవటమే రాహుల్ ముందున్న లక్ష్యం. ఇప్పటివరకు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేదని జనాలు అనుకుంటున్నారు. జనాల్లో ఆ అభిప్రాయాన్ని తుడిచేసి తానే మోడీకి నిజమైన ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన అవసరం రాహుల్ పై పడింది. అందుకనే పాదయాత్ర మొదలుపెట్టారు. దీన్నే బీజేపీ తట్టుకోలేకపోతోంది.
Tags:    

Similar News