తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారా?

Update: 2020-11-12 05:15 GMT
షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆయన ఆరోపించారు. ఆన్ లైన్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రంలోని హోంశాఖ అధికారులతో తాను చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటమా? లేదంటే మరింకేమైనా చేయొచ్చా? అన్న విషయాన్ని ఆలోస్తానని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు తెలంగాణలో కొత్త కలకలానికి తెర తీస్తాయని చెబుతున్నారు. ఫోన్ ట్యాప్ ఉదంతాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు సీరియస్ గా తీసుకుంటే తెలంగాణ సర్కారుకు కొత్త ఇబ్బందులు తప్పవంటున్నారు. గతంలోనూ కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న ఆరోపణల గురించి తెలిసిందే.

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చింది. ఈ అంశాన్ని కేంద్రంలోని బీజేపీ సీరియస్ గా తీసుకుంటుందా? లేదంటే.. మాట వరసకు అనేసి వదిలేస్తారా? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం గురించి చర్చకు సిద్ధమా అని మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. రాష్ట్రానికి కేంద్రం ఏ విషయంలో అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని ఆయన సవాలు విసిరారు. మరి.. కిషన్ రెడ్డి సవాలుకు కేసీఆర్ ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News