• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ మీద ప్రేమా లేక ...

జగన్ మీద ప్రేమా లేక కేసీయార్ మీద కోపమా...?

By - Tupaki Desk
Update: 2022-08-30 00:30 GMT
మొత్తానికి ఆరేళ్ల తరువాత కేంద్రంలోని బీజేపీలో కదలిక వచ్చింది. ఏపీ మీద కాస్తా ప్రేమనే చూపించింది. అదే సమయంలో తమ రాజకీయ క్షేత్రం అనుకున్న తెలంగాణాలో అక్కడ అధికార పార్టీ  టీయారెస్ మీద కన్నెర్ర చేసింది. ఎప్పటినుంచో ఏపీ మొత్తుకుంటున్న విత్యుత్ బకాయిల విషయంలో కేంద్రం తెలంగాణాను గట్టిగానే ఆదేశించింది.

విద్యుత్ బకాయులుగా వేల కోట్లుగా ఉన్న మొత్తాన్ని చెల్లించి తీరాల్సిందే అని హుకుం జారీ చేసింది. దీనికి నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ వివరాలు కనుక చూస్తే 2014 నుంచి 2017 దాకా ఉన్న కాలంలో తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్ద్ద మొత్తంలోనే  బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆరు వేల పై చిలుకుగా ఈ మొత్తాలని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది

ఇందులో 3,441 కోట్ల రూపాయలు అసలు మొత్తం అయితే లేట్ పేమెంట్ సర్ చార్జీలు పేరిట మరో   3,315 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ 6, 766 కోట్ల రూపాయల అతి పెద్ద   మొత్తాన్ని చెల్లించమంటూ ఎప్పటి నుంచో చంద్రబాబు, జగన్ కోరుతూనే ఉన్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళి మరీ మొరపెట్టుకున్నారు.

లేటెస్ట్ గా జగన్ చేసిన ఢిల్లీ టూర్ లో ప్రధానితో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలసి ఈ విషయం మీద చర్చించారు. నిజానికి ఎప్పటి నుంచో ఈ విషయం అడుగుతున్నా పట్టని కేంద్రం ఇపుడు మాత్రం సడెన్ గా ఆదేశాలు తెలంగాణా సర్కార్ కి జారీ చేయడం మాత్రం విచిత్రంగానే ఉంది అంటున్నారు.

ఇక్కడ రాజకీయం ఏమైనా కీలక పాత్ర పోషించిందా అన్న చర్చ కూడా వస్తోంది. కేసీయార్ ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్న కేంద్రం ఉన్నఫళంగా ఆరు వేల కోట్లను అది కూడా నెల రోజుల వ్యవధిలోగా చెల్లించమని కోరడమంటే కేసీయార్ కి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేయడమే అని అంటున్నారు.

ఆ విధంగా కేసీయార్ మీద వత్తిడి పెట్టడం ద్వారా అక్కడ రాజకీయంగా తాము సాధించవచ్చు అన్న ఆలోచన ఉంది. అదే టైమ్ లో ఏపీకి తాము న్యాయం చేస్తున్నామని చెప్పుకునే వీలు ఉంది. మరి జగన్ మీద ఏమైనా ప్రేమ కాదు కదా అంటే అది కూడా అనుకోవచ్చు అనే అంటున్నారు.

ఈ మధ్య టీడీపీతో టచ్ లోకి బీజేపీ వారు వెళ్తున్నారు అన్న వార్తలతో జగన్ కలత చెందారు అని ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఈ విధంగా చేయడం ద్వారా బీజేపీ ఏమైనా సంతోషపెట్టాలనుకుంటోందా అన్న మాట కూడా ఉంది.  ఏది ఏమైనా బీజేపీ పొలిటికల్ రూటే సెపరేట్ కాబట్టి ఏమైనా అనుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు కూడా. ఇక్కడ  తమ రాజకీయం తాము చేసుకునే విధంగానే ఆ పార్టీ ఎత్తులు ఉంటాయన్నది వాస్తవం అంటున్నారు. సో ఎలా అనుకున్నా అనుకోవచ్చు మరి.
Tags:    
  • BJP 
  • bharatiyajanataparty 
  • pmmodi 
  • narendramodi 
  • bjpgovernment 
  • ap 
  • ycp 
  • andhrapradesh 
  • telangana 
  • trs 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS